ముంబయి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తూ,నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి..గత రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.తూర్పు మలాడ్ ప్రాంతంలో గుడిసెలపై ఓ గోడ కూలి పడిపోవడంతో ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొంది. ఇదిలా వుంటే పూణేలో వర్షాల కారణంగా వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి.అనేక ఇళ్లు నీటమునిగాయి. ఇలాంటి భీకర పరిస్థితుల్లో చిక్కుకున్న ఓ 10 నెలల చిన్నారి, ఆ చిన్నారి కుటుంబాన్ని రెస్క్యూ సిబ్బంది అత్యంత చాకచక్యంగా రక్షించారు.



పుణేలోని మిత్రామండల్ చౌక్ ప్రాంతంలో వున్న ఓ ఇంటిలోకి బీభత్సమైన వరద నీరు చేరడంతో ఆ ఇంట్లో ఐదుగురు కుటుంబ సభులతో పాటుగా ఓ పదినెలల చిన్నారి చిక్కుకు పోయింది.ఈ విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం వెంటనే అక్కడికి చేరుకొని ఆ చిన్నారితోపాటుగా కుటుంబ సభ్యులను సకాలంలో కాపాడారు.ఇక బుధవారం నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడి సింహగడ్ రోడ్,ధనక్వాడి,బాలాజినగర్,అంబెగావ్,సహకర్ నగర్,కొల్హేవాడి,పురందర్,బారామతి,భోర్,హవేలి తహసీల్,వంటి పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరుకుంది.దీంతో పూణే జిల్లా కలెక్టర్ నావల్ కిషోర్ రామ్ గురువారం నగరంలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు.



ఇక భారీవర్షాలకు వరదలు వెల్లువెత్తాయి. ముంబై నగరంలోని ఖర్ ప్రాంతంలో ఓ భవనం కూలిన ఘటనలో పదేళ్ల బాలిక మరణించింది.బాలిక మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. భారీవర్షాల వల్ల పాత భవనాలు కూలిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.ఇక్కడి ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణాతీతం..ఇక గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలు ఇప్పుడు భారీవర్షాలుగా మారి పూణే నగరాన్ని పూర్తిగా జలమయం చేస్తున్నాయి.ఈ వర్షాల కారణంగా ఇప్పుడు అంటురోగాలు ఎక్కువగా ప్రబలే అవకాశాలు వున్నందున ఇప్పటి నుండే తగిన చర్యలు చేపడితే మంచిదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: