గత ఎన్నికల్లో భారీ మెజారిటీ నీ సొంతం చేసుకుని రెండో సారి అధికారంలోకి వచ్చింది  టిఆర్ఎస్. అయితే ప్రతిపక్షానికి  కావాల్సినన్ని సీట్లు  గెలవడంతో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది కాంగ్రెస్ . అయితే ఆ తర్వాత కాంగ్రెస్ నుండి మెజారిటీ ఎమ్మెల్యేలను తెరాస ప్రభుత్వం ఆకర్షించి  టిఆర్ఎస్ లో విలీనం చేసుకుంది. ఇక అప్పట్నుంచి ఉన్న ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి జంప్ అవుతారా అన్నట్టు ఉంది పరిస్థితి . 

 

 

 అయితే ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి చేరతానని తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని కొన్నిసార్లు భహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. అయితే బీజేపీలో చేరుతానని రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు బీజేపీ తీర్థం మాత్రం పుచ్చుకోలేదు. అయితే ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ లో  చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

 

 

 పది మందికి పైగా ఎమ్మెల్యేలను తెరాసలోకి ఆకర్షించిన  టిఆర్ఎస్... జగ్గా  రెడ్డి ని  మాత్రం ఆహ్వానించలేదని  సమాచారం. ఎందుకంటే జగ్గా రెడ్డి గతంలో కేసీఆర్,  కేటీఆర్,  హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేసినందువల్లే అని రాజకీయా విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే గత కొద్దీ రోజులుగా జగ్గా రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.  ఈ క్రమంలోనే  హరీష్ రావ్ తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం... హరీష్ రావు కు ఆత్మీయ సన్మానం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంటే హరీష్ రావు దగ్గర లైన్ క్లియర్ చేసుకుని టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు జగ్గారెడ్డి  ప్రయత్నిస్తున్నారా అనే చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది  . కాగా  జగ్గారెడ్డి  ఎమ్మెల్యే హోదాలో ఇవ్వని చేసారా.?లేక జగ్గారెడ్డి నిజంగానే తెరాస లో చేరేందుకు  సిద్ధంగా ఉన్నారా?  అన్నది  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: