చంద్రబాబునాయుడు విచిత్రమైన హెచ్చరిక చేశారు ఉన్నతాధికారులకు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని గ్రహించాలట.  జగన్మోహన్ రెడ్డి చెప్పారని తప్పుడు పనులన్నీ చేస్తారా ? అంటూ వాళ్ళపై మండిపోయారు. వైసిపి నేతలు, ఉన్నతాధికారులు చట్టాలను ఉల్లంఘిస్తు తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నారని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే ఉన్నతాధికారులు వాళ్ళు చెప్పినట్లే వింటారని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తెలీదా ? అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు కాకుండా ఉన్నతాధికారులు ప్రతిపక్షం చెప్పినట్లు వినాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యమా ? తన హయాంలో ఉన్నతాధికారులు ఎవరి మాట విన్నారో చంద్రబాబుకు తెలీదా ?

 

సిఎంగా ఎప్పుడు ఉన్న సకల వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకుని ఆడించే చంద్రబాబు కూడా నియమాలు, నిబంధనల గురించి మాట్లాడటమే విచిత్రంగా  ఉంది. తాను అధికారంలో ఉన్నంత కాలం ఉన్నతాధికారులతో సిండికేట్ బ్యాంకు చిహ్నం లాగ పనిచేయించుకోలేదా ?  వైసిపి నేతలను పోలీసులను ఉసిగొల్పిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

 

ప్రత్యేకహోదా కోసం విశాఖపట్నం వెళ్ళిన జగన్ ను విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరకీ గుర్తుండే ఉంటుంది. ఎవరు చెబితే తమ పరిధి కాకపోయినా విమానాశ్రయం రన్ వే మీదకు వెళ్ళి పోలీసులు అరెస్టులు చేశారు ? వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలను ఫిరాయించేట్లుగా ఎవరు చెబితే పోలీసు బాసు బేరసారాలు చేశారు ?

 

అప్పట్లో వైసిపి ఎంఎల్ఏలు, నేతలపై ఎవరు చెబితే కేసులు పెట్టి అరెస్టులు చేశారో చంద్రబాబు చెప్పగలరా ? ఏదో తానేం మాట్లాడినా అచ్చేసొదిలే మీడియా ఉంది కదా అని పనికిమాలిన మాటలన్నింటినీ మాట్లేడేస్తున్నారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ వల్ల రాష్ట్రానికి రూ. 7500 కోట్లు నష్టం జరిగిందని ఆరోపిస్తున్నారు. వేల కోట్లు నష్టం ఏ విధంగా వచ్చిందో అడిగితే మాత్రం నోరిప్పటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: