తొలి స్వాతంత్ర సమరయోధుడు అంటూ ఘనంగా నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీ కధ  విషయంలో  చరిత్రకారుల నుంచి అనేక రకాలైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బ్రిటిష్ వారిపైన పోరాటం చేసిన తొలి వీరుడు, శూరుడు అంటున్నా అది అసలు కధ అది కానే కాదని సినిమాటిక్ కల్పన అని చరిత్రకారులు అంటున్నారు. నరసింహారెడ్డి ఓ పాలెగాడు అని, ఆయన పించను నిలుపుదల చేయడంతో తన జీవితం కోసం చేసిన పోరాటాన్ని తిరుగుబాటుగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరించారని అంటున్నారు.


నిజానికి 1800 శశతాబ్దంలో  జరిగిన అనేక తిరుగుబాట్లు, బ్రిటిష్ వారి మీద  నేరుగా చేసిన పోరాటాలకు ఉయ్యాలవాడ వారి కధకు ఎంతో తేడా ఉందని అంటున్నారు. బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి ఎన్నో త్యాగాలకు సిధ్ధపడి మాత్రుభూమి పరిరక్షణ కోసం అసులువు బాసిన వారిలో ఝాన్సీ లక్ష్మీ బాయి వంటివారు ఎందరో కనిపిస్తారు. వారందరి లక్ష్యం ఈ గడ్డ మీద బ్రిటిష్ వారు ఉండరాదని. ఇక 1857లో  సిపాయిల తిరుగుబాటు ఉండనే ఉంది.


అయితే అన్నిటికీ మించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కధ ఏంటి అంటే ఆయన ఓ పాలెగాడు, సీమ జిల్లాలకు సంబంధించి ప్రజలు, రైతులు ఇచ్చే శిస్తును కొంత తాను ఉంచుకుని మరి కొంత కప్పం కట్టే  పాలెగాడు అన్నమాట. ఈ పాలెగాళ్ళ వ్యవస్థను   తొలగించి విప్లవాత్మకమైన మార్పులకు నాటి  బ్రిటిష్ అధికారి ధామస్ మన్రో ఎంతో క్రుషి చేశాడు.  ఆయన రైతు వారీ వ్యవస్థను ప్రవేశపెట్టి పాలెగాళ్ళ నుంచి వారి దురాగతాల నుంచి రైతులను, ప్రజలను కాపాడుతారు.


అయితే అది నచ్చని పాలెగాళ్ళు కొంతమంది అసంత్రుప్తి వ్యక్తం చేస్తే వారి జీవనోపాధి కోసం  వారికి పించను వ్యవస్థను తీసుకువచ్చింది కూడా ఆయనే. అటువంటి  అధికారి మీద 1800 సంవత్సరంలో కూడా కొంతమంది పాలెగాళ్ళు తిరుగుబాటు చేయడం, అరెస్టులు కావడం జరిగింది. ఇదంతా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధం లేని కధ. అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సీన్లోకి వచ్చినిది 1840ల ప్రాంతంలో ఆయనకు వరసకు తాత అయిన నొసం నరసింహారెడ్డి అనే పాలెగాడికి బ్రిటిష్ వారు పించనుగా 8,323 రూపాయలు చెల్లిస్తారు. 1804లో నొసుం నరసింహారెడ్డి చనిపోతే ఆయన భార్యకు కూడా పించను బ్రిటిష్ వారు ఇస్తారు. ఇక నరసింహారెడ్డి  దత్త కుమారుడు జయరామిరెడ్డి, ఆయన మనవడే ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన వరకూ పించను వచ్చేసరికి పది రూపాయల పది అణాల వాటాగా దక్కుతుంది.


అది ఇవ్వడానికి కూడా అవమానించే పరిస్థితులు నాడు  ఉండడం, బ్రిటిష్ వారి సరిగ్గా ఇవ్వకపోవడం వల్లనే కంపెనీ అధికారుల మీద ఉయ్యాలవాడ  నరసింహారెడ్డి తిరుగుబాటు చేస్తాడు. తనతో పాటు అయిదు వేల మంది సైన్యాన్ని తయారు చేసుకుని ఇతర పాలెగాళ్ళను కూడా కలుపుకుని కంపెనీ  అధికారుల మీద పోరాడుతాడు. ఇందులో కడప కలెక్టర్ కాక్రెన్ కుయుక్తులు పన్నడంతో నరసింహారెడ్డి దొరికిపోతాడు. ఆతన్ని 1846 అక్టోబర్ 6న వురి తీస్తారు. ఇది అసలు కధ. 


ఇందులో  ఉయ్యాలవాడ    నరసింహారెడ్డి దేశం కోసం పోరాటం చేసినట్లు ఎక్కడా ఉండదు, పైగా అయన బ్రిటిష్ వారి మీద కూడా పోరాటం చేయలేదు. ఈస్టిండియా కంపెనీ తరఫున వచ్చిన కొందరు అధికారుల మీదనే ఆయన పోరాటం సాగింది. అది కూడా ఆయన పించను సరిగ్గా ఇవ్వలేదని,అవమానించారని బాధతో చేసిన పొరాటం అని చరిత్రకారులు అంటారు. ఇక 46 ఏళ్ళ వయసులో ఉయ్యాలవాడ ఉరితీయబడ్డాడు.


 ఆయన తాతల నాటి పించను తినడమే తప్ప అప్పటివరకూ  తాను సొంతంగా ఏ ఉపాధీ చూసుకూలేదని కూడా చరిత్రకారులు చెబుతారు. అంటే బ్రిటిష్ వారు పడేసే ఆ పైసల కోసం ఆధారపడి వారు ఇవ్వక ఇబ్బందుల పాలు చేస్తే కొందరు అధికారులతో తగాయిదా పెట్టుకున్న ఉయ్యాలవాడ  నరసింహారెడ్డి  దేశానికి తొలి స్వాతంత్ర సమరయోధుడు ఎలా అవుతారని ప్రశిస్తున్నారు.ఈ సినిమా ఓ కల్పనగా చెప్పుకుంటే బాగుంటుందని కూడా సలహా ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: