దేశంమారిన,దేశంలోని భాషమారిన వ్యక్తులు మారిన,మారనిది ఒకటే దేవుడు,వైద్యుడు.ఎక్కడైన దేవుడు పూజలు అందు కుంటాడు.వైద్యుడు తన వృత్తిలో ఎన్నో ప్రాణాలు రక్షిస్తాడు.ఒకరు కనిపించక దేవుడైతే,మరొకరిని ఆపద సమయాల్లో చేరదీసి ప్రాణపాయం నుంచి గట్టెక్కించి,కనిపించే దేవుళ్లు అంటారు..సుదీర్ఘకాలం విద్యాభ్యాసం చేసి మారమూల పల్లె ప్రజలతో పాటు నిరుపేద కుటుంబాలను మొదలుకొని ఉన్నతస్థాయి పెద్దలను ఎన్నో ప్రమాదకర పరిస్థితుల నుంచి వైద్యులు కాపాడిన సందర్భాలు ఎన్నోవారి జీవితంలో కనిపిస్తాయి.కవి కాళోజీ అన్నట్లు కన్ను తెరిస్తే జననం...కన్ను మూస్తే మరణం...రెప్ప పాటే జీవితం.అయినప్పటికీ ఈ ప్రయాణంలో ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో వైద్యుని వద్దకు వెళ్లే ఉంటాడు..



తనకున్న మేధోశక్తితో చివరి క్షణం దాకా తన వద్దకు వచ్చే రోగిని బతికించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వైద్యుడు.తన చేతుల్లో ఎవరైనా చనిపోతే ఆ వైద్యుడు తల్లిలా తల్లడిల్లి పోతాడు.ఎదుటవ్యక్తి  ప్రాణాలు కాపాడడానికి తను పడే తపన చూస్తుంటే మానవ సేవే మాధవ సేవ అనే పదం గుర్తుకు వస్తుంది.ఇక ఈ వైద్య వృత్తిలో ఎంతగా సేవా నిరతి కలిగి ఉంటే అంతటి గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు.ఇది నిజమైన వైద్యవృత్తి అంటే.ఆ దేవుడు సృష్టిచేస్తే ఆ సృష్టిని సమర్దవంతంగా కాపాడే వాడే డాక్టర్.కాని ఈ కాలంలో కొన్నిచోట్ల డాక్టర్స్‌ను చూస్తుంటే వీరు వుండవలసింది ఇక్కడకాదు నరకంలో యమభటుల మధ్యలో అనిపిస్తుంది.ఇంత కౄరంగా ఎలా ఆలోచిస్తున్నారో అర్ధం కావడంలేదు.పసివారు దైవంతో సమానం అంటారు.అలాంటి మాటలు కూడా సరిగ్గా రాని చిన్నారుల జీవితాలను డబ్బు అనే మాయదారి మైకంలో పడి నాశనం చేస్తున్నారు.



ఇదే వారింట్లో వారి కూతురికో,మనవరాలుకో జరిగితే ఊరుకుంటారా.విలువైన మానవ జన్మ పొందింది మనుషులుగా బ్రతకడం కోసం.మానవత్వం మరచి రాక్షాసుల్లా ప్రవర్తించమని కాదు.వైద్యుడు దేవుడైతే,వైద్యశాల దేవాలయం.ఈ దేవాలయాన్ని హింసాలయంగా మారుస్తున్నారు కొందరు డాక్టర్స్.పేరుకు పెద్దపెద్ద దావాఖానాలు.ఉన్నత చదువులు చదివిన విద్యా వంతు లు డాక్టర్స్ అని చెప్పుకుంటూ తిరుగుతారు కాని చేసే పనులు మాత్రం నీచాతి నీచం.ఇప్పుడున్న నీలోఫర్ ఆస్పత్రి పరిస్దితి ఇదే.ఇన్ని దారుణాలకు మూలమైన ఈ హస్పిటల్ పై రాష్ట్రప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది,నిందితులను ఎలా ఎన్ని రోజుల్లో శిక్షిస్తుంది.అంటూ బాధిత కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: