జీఎస్టీని సక్రమంగా చెల్లించే చిన్న వ్యాపారులకు త్వరలో కేంద్రం శుభవార్త చెప్పనుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలీదు. చిన్న వ్యాపారుల కోసం కొత్త పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్నయనించుకుందట. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం గత సంవత్సరం 59 నిమిషాలకే లోన్ వచ్చేలా ఓ పథకాన్ని తీసుకొచ్చింది.      


ఇప్పుడు అదే తరహాలో చిన్న వ్యాపారుల కోసం జీఎస్టీ ఎక్స్‌ప్రెస్ స్కీమ్‌ను ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తుందట. ఎవరైతే సరిగ్గా 6 నెలలు క్రమం తప్పకుండా జీఎస్టీని సక్రమంగా చెల్లిస్తారో ఆ వ్యాపారులకు ఎలాంటి ఫైనాన్సియల్ స్టేట్‌మెంట్ లేకుండా కోటి రూపాయిల వరుకు లోన్ మంజూరు చేస్తారు.                                                                             


ఈ పథకం త్వరలోనే అమలు కానుందట. ఈ పథకానికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. కాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోడానికి ముఖ్యకారణం ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు చిన్న వ్యాపారులకు ఆర్ధికంగా సహాయం చేసేందకు ముందుకు వచ్చిందట. ఈ జీఎస్టీ ఎక్స్‌ప్రెస్ స్కీమ్ కేబినెట్ ఆమోదం తర్వాత అమల్లోకి రానుంది.                                       

                             


మరింత సమాచారం తెలుసుకోండి: