కాశ్మీర్ ఇపుడు ఈ పేరు చెప్పుకుని అంతర్జాతీయ వేదికలు ప్రకంపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇదే అంశం చర్చకు వస్తోంది. ఈ ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి. ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. మరెన్నో సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ తెగని రావణ కాష్టాలు ఎన్నో ఉన్నాయి. వేటికీ రాని ప్రచారం ఒక్క కాశ్మీర్ కే రావడం ఏంటి. కాశ్మీర్  అంటే ఎందుకంత మోజు. నిజంగా అది మోజా. కాశ్మీర్ ని ఆధారం చేసుకుని ఆడే రాజకీయ జూదమా.


కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అన్న మాట వింటే తోక తొక్కిన తాచులా లేస్తుంది పాకిస్తాన్. గత రెండు నెలలుగా కాశ్మీర్ విషయంలో పాక్ రెచ్చిపోతూనే వుంది. ఆర్టికల్ 370ని మోడీ సర్కార్ రద్దు చేయగానే పాక్ శివాలెత్తిపోయింది. నాటి నుంచి ఇప్పటివరకూ కాశ్మీర్ అన్న జపం తప్ప మరో మాట లేదు. ఐక్య రాజ్య సమితిలో కాశ్మీర్ అంశం మళ్ళీ వల్లే వేసి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  విషం కక్కారు. భారత్ లో ఫాసిస్ట్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఆయన చెప్పడం దారుణమే. ఆరెసెస్ అన్న సంస్థ నియంతల లక్షణాలను పుణికిపుచ్చుకుని ఏర్పాటైందని, ఆ సంస్థకు మోదీ జీవితకాల సభ్యుడని కూడా ఇమ్రాన్ నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు.


అంతేనా తమది చిన్న దేశమని భారత్ దాడి చేసేందుకు యత్నిస్తోందని కూడా భయంపుట్టించారు. తాము భారత్ మొత్తంలో ఏడవ వంతు ఉంటామని, అయిన జడిసిపోవడం లేదని భారత్ తో యుధ్ధం వస్తే ఎదురుతిరిగి పోరాడుతామని ఇమ్రాన్ ఖాన్ బీరాలు పలికారు. కాశ్మీర్ ఇపుడు కర్ఫ్యూలో ఉందని, ఒకవేళ కర్ఫ్యూ ఎత్తివేస్తే మాత్రం అక్కడ జరిగేది రక్తపాతమేనని కూడా ఇమ్రాన్ అంటున్నారు. కాశ్మీర్లో ముస్లిం యువతను అణచివేస్తున్నారని అంటున్నారు. ఇక యుధ్ధం వస్తే అణ్వాయుధాలను తాము ప్రయోగించి తీరుతామని కూడా ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించడం ఆయన సహనం కోల్పోయారని చెప్పడానికి నిదర్శనం.



మరింత సమాచారం తెలుసుకోండి: