అమ్మా అనేపదానికి అనాదినుండి ఉన్న ప్రాముఖ్యత మనందరికి తెలిసిందే.ఆపదంతో పిలిచితే ఎటువంటి కఠినాత్మురాలి మనసైనా కరుగుతుందంటారు.అది నిజమేఅనిపిస్తుంది.ఎందుకంటే ఒక్క మనుషుల్లోనేకాదు,జంతువుల్లో,పక్షుల్లో కూడా తల్లిస్ధానం ఎంతగొప్పదో అక్కడక్కడ జరిగే సంఘటనలే నిదర్శనంగా నిలుస్తాయి.ఇక అమ్మా అనే పదంలోని ఆర్తి ఎంతగొప్ప దంటే అది మాటలకు అందనిది.అందుకే ఆ పదాన్ని అమృతంతో పోలుస్తారు.కాని సమాజంలో వున్న కొందరు వెధవలు ఎలా తయారైయ్యా రంటే తల్లిపాలను కూడా అంగట్లో అమ్మేలా మారుతున్నారు.



అమ్మ పిలుపులోని అర్ధాన్ని,అపార్ధం చేసుకుంటున్నారు.ఇందుకు ఉదాహరణ తాజాగ జరిగిన ఈ సంఘటనే.అమ్మా అమ్మా అంటూనే ఆ అమ్మ రొమ్మునే తాకాలని ప్రయత్నించాడు ఓ నీచుడు.వాడికి ఆసమయంలో కన్న తల్లి గుర్తుకు రాలేదేమో. తోబుట్టిన వారు కళ్లముందు కదలాడలేదేమో.అయినా మానవత్వం వున్నవాడు ఇవన్ని ఆలోచిస్తాడు.కాని మృగంలా మారిన వాడికి వరుసలతో సంబంధమేంటి.ఇప్పుడు ఓ పనికిమాలిన వాడి వల్ల నిండు ప్రాణం పోయింది.ఆమె పిల్లలు అనాధలైయ్యారు. ఇదంతా మాధవ్ అనే ఈ మూర్ఖుడు చేసిన పని.



కంచిలి స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి ఉపాధి హామీ కార్యాలయంలో ఇంజనీర్ కన్సల్టెంట్‌గా పనిచేసే మాధవ్ అనే కిరాతకుడు అద్దెకు దిగాడట.అనంతరం క్రింది పోర్షన్‌ల్లో వున్నవారిని అమ్మా,నాన్నలని పిలూస్తునే ఓ రోజు ఆ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి బెదిరింపులకు పాల్పడటం మొదలు పెట్టాడట.తన కోరిక తీర్చమని లేకుండే ఈ వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టి మీ పరువు తీస్తానని భయపెడుతూ వుండేవాడట.రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువవడంతో అతనికి తలవంచడం ఇష్టం లేని ఆ యువతి తన ప్రాణాలు బలవంతంగా తీసుకుందట.ఈ విషయం తెలుసుకున్న కంచిలి పోలీసులు నిందుతున్ని అరెస్ట్ చేసి కేసు పూర్వఫలాలను పరిశీలిస్తున్నారట. చూసారా నమ్మకద్రోహంతో ఓ వ్యక్తి చేసిన పనికి ఆ కుటుంబం, వారి పిల్లలు రోడ్డున పడి అనాధలయ్యారు.అందుకే ఎవరిని అతిగా నమ్మకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: