భార‌త‌దేశం యొక్క భూభాగంలో ప్రాంత‌మైన క‌శ్మీర్‌కు చెందిన ఆర్టిక‌ల్ 370 విష‌యంలో...మ‌న ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై తీవ్రస్థాయిలో భ‌గ్గుమంటున్న పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ తాజాగా మ‌రింత ఆసక్తిక‌ర రీతిలో వ్య‌వ‌హ‌రించారు.ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఇమ్రాన్ ఖాన్ 50 నిమిషాలు మాట్లాడారు. తీవ్ర వ‌త్తిడిలో ఉన్న‌ట్లు ఇమ్రాన్ క‌నిపించారు. ఆర్ఎస్ఎస్ గురించి ఐక్య‌రాజ్య‌స‌మితిలో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ప్ర‌స్తావించారు. ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో ఉగ్ర‌వాదులు శిక్ష‌ణ పొందుతున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ హోంమంత్రి ఆరోపించిన‌ట్లు ఇమ్రాన్ త‌న ప్ర‌సంగంలో తెలిపారు. ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా ఇవాళ ఆర్ఎస్ఎస్ నేత‌లు మాట్లాడారు.


రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్‌(ఆర్ఎస్ఎస్‌) నేత డాక్ట‌ర్ కృష్ణ గోపాల్ శ‌ర్మ మీడియాతో మాట్లాడుతూ.... ఆర్ఎస్ఎస్ కేవ‌లం ఇండియాలో మాత్ర‌మే ఉన్న‌ద‌ని, ఇత‌ర దేశాల్లో త‌మకు ఎటువంటి శాఖ‌లు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మపై పాకిస్థాన్‌కు ఆగ్ర‌హం ఉందంటే, అది భార‌త్‌పై ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లే అని తెలిపారు. ఆర్ఎస్ఎస్‌, భార‌త్ రెండూ ప‌ర్యాయ ప‌దాలు అని, ప్రపంచ దేశాలు కూడా ఇండియా, ఆర్ఎస్ఎస్‌ను ఒక్క‌టిగా చూడాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని శ‌ర్మ అన్నారు. 


కాగా, తీవ్ర స్థాయిలో విద్వేష ప్ర‌సంగం చేసిన పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ...యూఎన్ వేదికగా శాంతి మంత్రాన్ని వ‌ల్లించింది త‌క్కువే. ఆయ‌న కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే త‌న ప్ర‌సంగంలో శాంతి అన్న ప‌దాన్ని వాడారు. ఇమ్రాన్ ప్ర‌సంగాన్ని విశ్లేషిస్తే.. అత‌నెంత యుద్ధ కామంతో ఉన్నాడో అర్థ‌మ‌వుతుంది. ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో మాట్లాడాల్సింది 15 నిమిషాలే. ప్ర‌ధాని మోదీ 17 నిమిషాలు మాట్లాడారు. ఇక ఇమ్రాన్ మాత్రం 50 నిమిషాలు మాట్లాడారు. అది కూడా భార‌త్‌పై విషం చిమ్ముతూ త‌న నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఇస్లాం, ఇస్లామోఫోబియా గురించి ప‌దే ప‌దే చెప్పారు. త‌న ప్ర‌సంగంలో ఆ మాట‌ల‌ను సుమారు 71 సార్లు వ‌ల్లించారు. పాకిస్థాన్‌, క‌శ్మీర్ అనే ప‌దాల‌ను ఇమ్రాన్ సుమారు 25 సార్లు చెప్పారు. ఇండియా పేరును 17 సార్లు, మోదీ పేరున 12 సార్లు ప్ర‌స్తావించారు.ఇక ఉగ్ర‌వాదం అనే ప‌దాన్ని త‌న ప్ర‌సంగంలో 28 సార్లు వినిపించారు. ప్ర‌స్తుతం పాక్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న‌ది. దీంతో ఆయ‌న డ‌బ్బు అన్న ప‌దాన్ని కూడా త‌న ప్ర‌సంగంలో 14 సార్లు ప‌లికారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: