గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో బోటు ను  బయటకు తీసేందుకు ఈరోజు పనులు మొదలు పెట్టనున్నారు. అయితే ఈ నెల 15 న కుచ్చలూరు  వద్ద పాపికొండలు టూర్ కి బయలుదేరిన బోటు గోదావరి మధ్యలో ఏర్పడిన సుడిగుండం కారణంగా గోదావరిలో  పొంగిపోయింది . అయితే ఈ బోటు ప్రమాదంలో కొంత మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన... కొంతమంది జీవితాలు గోదావరి ప్రవాహానికి చెల్లాచెదురై పోయాయి. 

 

 

 

 అయితే గల్లంతైన వారి మృతదేహాలలో ఇప్పటికే  అధికారులు కొన్ని మృతదేహాలను వెలికి తీయగా... ఇంకొన్ని  మృతదేహాలు ఆచూకీ  మాత్రం లభించ లేదు. ప్రమాదం జరిగిన అనంతరం మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన మృతదేహాలు బోట్  లోనే ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. అయితే వాటిని వెలికితీయడం ఎన్డీఆర్ఎఫ్  బృందానికి అసాధ్యం అని చెప్పడంతో బోటును వెలికితీసే పనులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు అధికారులు . కాకినాడకు చెందిన ధర్మాడి  సత్యానికి బోటు వెలికితీసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.  

 

 

 

 ఇక ఇందుకోసం 22.70 లక్షలు ఖర్చు అవుతుందని  ప్రభుత్వం అంచనా వేసింది. అయితే దర్మాడీ సత్యం బృందానికి  35 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి జాగ్రత్తగా బోటు బయటకు తీసే అవకాశం ఉందని కలెక్టర్ చెబుతున్నారు . కాగా బోటు  నీళ్ళల్లో మునిగి రెండు వారాల పైగా అవుతుంది  కాబట్టి బోటు విరిగిపోకుండా బయటకు తీయడం పెద్ద సవాల్ అని చెప్పవచ్చు . అయితే  ఓ భారీ యాంకర్ ను  బోట్ కి  తగిలించి తాళ్లతో  పైకి లాగాలని ఆలోచనలలో ధర్మ డి సత్యం బృందం ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే బోటు కే  తాళ్ళు కట్టి లాగాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు వ్యూహాలు పని చేయకపోతే మరో  కొత్త ఆలోచన చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: