తెలుగు రాష్ట్రాలకు పచ్చని తోరణం లా ఉండే నల్లమల అడవిని  యురేనియం తవ్వకాలు పేరుతో నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నల్లమలలో యురేనియం  తవ్వకాలను అనుమతించబోమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కేంద్రం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు . తెలుగు రాష్ట్రాలకు ప్రాణవాయువును అందిస్తూ... వన్యప్రాణులకు అపురూప నిలయంగా ఉన్న నల్లమల్ల మహారణ్యం యురేనియం  తవ్వకాలు జరిపితే స్మశానంగా మారుతుందని తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సేవ్ నల్లమల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు తెలుగు ప్రజలు. 

 

 

 

 నల్లమలలో యురేనియం తవ్వకాలు జరగకుండా  అడ్డుకుంటామని సేవ్ నల్లమల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. దీనికోసం అందరిలో చైతన్యం కల్పిస్తూ సేవ నల్లమల ఉద్యమం వైపు నడుస్తున్నారు. అయితే పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి ఉన్న మన రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా   మొదలయ్యాయి . అయితే అంబరాన్నంటే బతుకమ్మ సంబరాలను ప్రతి ఏటా తమ కష్టాలను తీర్చమని మొక్కుకునే ప్రజలు... ఈసారి నల్లమల కు వచ్చిన కష్టాలు తీర్చమని కోరుతూ నల్లమల ఉద్యమాన్ని బతుకమ్మ సంబరాల్లో  తెలుపుతున్నారు. 

 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి బతుకమ్మ పాటలో   సేవ నల్లమల ఉద్యమ ప్రతిధ్వని వినిపిస్తుంది.ఈ క్రమంలో  విమలక్క పాడిన బతుకమ్మ పాటను విడుదల చేశారు. కాగా విమలక్క పాడిన ప్రతి అక్షరంలో సేవ్ నల్లమల యొక్క నినాదం కనిపిస్తుంది. ప్రతి చరణంలో మేము నల్లమల్లని కాపాడుకుంటామని ధైర్యం కనిపిస్తుంది.అయితే ఈ పాటను విన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమలక్క పాడిన పాట ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుందని ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: