నవరాత్రుల తొలి రోజున ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వరకోకిల లతా మంగేష్కర్ కు జన్మదిన శుభకాంక్షలు తెలిపిన పీఎం.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


ప్రధాని మోడీ మన్ కీ  బాత్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు 90వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  తాను విదేశీ పర్యటనకు వెళ్లేముందు లతా దీదీతో మాట్లాడాననీ, ఇది తనకు దక్కిన మహద్భాగ్యమని అన్నారు మోడీ. లత మంగేష్కర్ మంచి ఆరోగ్యకర జీవితం గడుపుతూ ఆహ్లాదంగా ఉండాలనీ.. తమను దీవించాలని ఆకాంక్షించారు.

ఈ సిగరెట్లు, సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందనీ... వాటికి దూరంగా ఉండాలని మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోడీ విజ్ఞప్తి చేశారు. ఈ- సిగరెట్లు హాని చేయవన్న ఓ అపోహ చాలా మందిలో ఉందనీ, కానీ.. సిగరెట్లు, పొగాకు మాదిరిగానే ఈ- సిగరెట్లు కూడా ఆరోగ్యానికి చాలా హానికరమన్నారని హెచ్చరించారు. అందుకే ఈ- సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. అందరం కలిసి ఆర్యోగకరమైన భారత్‌ను నిర్మిద్దామని ప్రధాని మోడీ యువతకు పిలుపునిచ్చారు. దసరా పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల విజయాలను వేడుకలా జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా దేశవాసులను కోరారు.

మొత్తానికి ప్రధాని మోడీ దసరా సందర్భంగా ఆయన చెప్పిన మాటలు దేశ ప్రజల ఆరోగ్యాన్ని ఉద్దేశించి ఉన్నాయి. ముఖ్యంగా యువత దురలవాట్లకు గురికాకుండా ఉండాలనేే ఆకాంక్ష.. ఆయన గొప్పతనానికి అద్దం పడుతోంది. ప్రధాని పదవిలో ఉన్నా.. గాయణి లతా మంగేష్కర్ ఆశీర్వాదాలు కోరుకోవడంలో ప్రధానిలో ఎలాంటి గర్వం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.  

 



మరింత సమాచారం తెలుసుకోండి: