టిక్ టాక్ ఇప్పటికే కొన్ని వేలమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఈ టిక్ టాక్ వల్ల చాలామంది సెలబ్రెటీస్ అయ్యారు. చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. దేశం మొత్తంలో టిక్ టాక్ వల్ల రోజుకు ఒకరైన మృతి చెందుతున్నారు. టిక్ టాక్ లో వచ్చే లైకులు, కామెంట్ల కోసం ఆశ పది ప్రాణాలు తీసుకుంటున్నారు ఈ కాలపు యువతీ, యువకులు.      


వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బయప్పనహళ్లి చెందిన మహ్మద్ మతీమ్, జబీవుల్లా, షరీఫ్‌లు ముగ్గురు స్నేహితులు. వీరిలో ఒకరు మెకానిక్, మరొకరు ఫుడ్ డెలివరీ బాయ్. టిక్ టాక్ లో వీడియోలు చెయ్యడానికి సరదాగా శుక్రవారం సాయంత్రం ముగ్గురూ బయప్పనహళ్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని శ్రీరామపుర రైల్వేగేటు దగ్గర పట్టాలపై వీడియో తీసుకునేందుకు వెళ్లారు.        


ట్రైయిన్ వస్తుండగా టిక్‌టాక్ కోసం వీడియో తీసుకోవాలనుకున్నారు. షరీఫ్, మతీమ్‌ పట్టాలపై డ్యాన్స్ చేస్తుండగా.. జబీవుల్లా మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో కోలార్ నుంచి బెంగుళూరు వైపు ప్యాసింజర్ ట్రైయిన్ అటు వచ్చింది. ఆలా వస్తున్న ట్రైన్ కూడా గమనించకుండా వీడియో కోసం డ్యాన్స్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.          


దీంతో ట్రైన్ వచ్చి 'ఢీ' కొట్టడంతో అఫ్తాబ్‌ పట్టాల పక్కనే ఉన్న స్తంభానికి తగిలి పడిపోయాడు. మిగిలిన ఇద్దరిపై నుంచి ట్రైయిన్ వెళ్లిపోయింది. ఘటనలో మతీమ్, షరీఫ్‌లు మృతి చెందగా జబీవుల్లాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చూసారుగా టిక్ టాక్ పిచ్చితో ఎంతో ఘోరంగా చనిపోయారో. ఒకప్పుడు రైలు పట్టాలపై ఆత్మహత్యలు చేసుకునే వారు ఇప్పుడు టిక్ టాక్ పిచ్చితో చచ్చిపోతున్నారు.               



మరింత సమాచారం తెలుసుకోండి: