దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీయార్ పెద్దల్లుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఓ దశలో టీడీపీలో సీఎం క్యాండిడేట్ గా కూడా ప్రచారం తెచ్చుకున్నారు. అన్న గారి పార్టీ చీలినపుడు బలవంతంగానే తోడల్లుడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అదే ఆయన రాజకీయ  జీవితంలో చేసిన పెద్ద పొరపాటు అంటారు. ఆనాడు అలా చేయకుండా ఉంటే దగ్గుబాటి కెరీర్ వేరే మలుపు తిరిగేదని, బహుశా ఆయనకే సీఎం చాన్స్ వచ్చేదని అన్నవారూ ఉన్నారు.


ఇక దగ్గుబాట్ ఎన్టీయార్ మరణానంతరం పొలిటికల్ గా  పెద్దగా పుంజుకోలేదు. బీజేపీలో చేరినా కాంగ్రెస్ లోకి వెళ్ళినా కూడా ఆయన ఎమ్మెల్యేగానే మిగిలారు. ఇక ఆయన చాలా కాలం తరువాత వైసీపీ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన  సొంత  సీటు పరుచూర్ లో  ఓటమి పాలు అయ్యారు ఇక నాలుగు నెలలుగా రాజకీయంగా క్రియాశీలం కాని దగ్గుబాటి వైసీపీలో ఉన్నట్లా  లేనట్లా అన్న చర్చ కూడా సాగుతోంది.
మరో వైపు దగ్గుబాటి బీజేపీలోకి వెళ్తారని అంటున్నా అక్కడ భార్య పురంధేశ్వరికే పెద్దగా ప్రాధా న్య‌త లేదని, కొత్త పూజారుల రాకతో ఏపీ బీజేపీలో కొత్త గొంతుకలు ఎక్కువగా  వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇక దగ్గుబాటి కి షాక్ ఇచ్చేలా జగన్ సైతం పరుచూరులో వైసీపీ ఇంచార్జి బాధ్యతలు కూడా వేరే వారిని అప్పగించారు.


ఈ నేపధ్యంలో దగ్గుబాటి చాలా అసంత్రుప్తిగా ఉన్నారని టాక్. తాను సీనియర్ మోస్ట్ లీడర్ని అని తనను గౌరవిచే విధానం ఇది కాదని ఆయన మధన పడుతున్నారని అంటున్నారు. తాను వైసీపీలో చేరడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో మార్పు వచ్చిందని, అది వైసీపీ వైపుగా టర్న్ అయిందని ఆయన నమ్ముతున్నారు. తాను ఓటమి పాలు అయినా తనకు జగన్ సముచిత స్థానం కల్పిచాలని ఆయన కోరుకుంటున్నారు.


తనకు పెద్దల సభలో ఎమ్మెల్సీ అయినా, రాజ్యసభ మెంబర్ అయినా జగన్ ఇవ్వాలన్నది దగ్గుబాటి కోరికగా ఉంది. మరి జగన్ ముందు ఎంతో మంది ఆశావహులు ఉన్నారు. వారిని పక్కన పెట్టి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గుబాటికి పెద్దపీట వేస్తారా అన్నది చూడాలి. దగ్గుబాటి సొంత సీట్లోనే పరపతి లేదని రుజువు అయిన వేళ ఆయన్ని పొలిటికల్ గా  రీచార్జి చేస్తే వైసీపీకి ఎంతమేరకు ఉపయోగం అన్నది కూడా పార్టీ వర్గాల్లో చర్చగా ఉంది. ఏది ఏమైనా పెద్దల్లుడు పెద్ద ఆశలతో ఉన్నారు. అవి తీరకపోతే ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: