మహాత్మాగాంధి కలలు కన్న ప్రజల వద్దకే ప్రభుత్వం అన్న  కాన్సెప్టును జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాలనే వ్యవస్ధను కొత్తగా  ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్ధను సక్రమంగా పనిచేయించేందుకు సుమారు  1.3 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. మండలానికి ఒకటి చొప్పున 660 గ్రామ సచివాలయాలు, మున్సిపాలిటి ప్రాంతాల్లో  110 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.

  

ఎంపికైన 1.3 లక్షల మంది శాస్వత ఉద్యోగులకు జగన్ దసరాపండుగ సందర్భంగా అపాయింట్మెంట్ ఉత్తర్వులు అందించటమంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే లక్షలమంది మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘటన జగన్ దే అనటంలో సందేహం లేదు. ఈ వ్యవస్ధ మహాత్మాగాంధి జయంతి అక్టోబర్ 2వ తేదీ నుండి అమల్లోకి రాబోతోంది.

 

సచివాలయాల్లో ఉద్యోగులుగా ఎంపికైన వారికి పెద్ద జాబ్ చార్టే ఉంది. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోను, వార్డుల పరిధిలోని ప్రజల ఇళ్ళకు ప్రతి రోజు ఈ ఉద్యోగులు వెళ్ళాలి. వాళ్ళ బాగోగులు చూసుకునేందుకు కుటుంబసభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకు అందేట్లు చూడాల్సిన బాధ్యత వాలంటీర్లదే.

 

అంతేకాకుండా గ్రామసచివాలయాల్లో ప్రజలకు ఎటువంటి పనులున్నా ఎక్కడా లేటు కాకుండా చేసి పెట్టాల్సిన బాధ్యత కూడా ఉద్యోగులపైనే ఉంటుంది. ఎక్కడైనా తప్పులు దొర్లినా, అవకతవకలకు పాల్పడినా వెంటనే వాళ్ళపై కఠినమైన చర్యలుంటాయని జగన్ గతంలోనే హెచ్చరించారు. దీన్ని బట్టే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సచివాలయాల ఉద్యోగులు ఎంత కీలక పాత్ర పోషిస్తారో అర్ధమైపోతోంది.

 

గతంలో చంద్రబాబునాయుడు హయాంలో ప్రజల వద్దకే పాలన అనే కాన్సెప్ట్ వచ్చినా ఆచరణలో పెద్దగా సక్సెస్ కాలేదని అందరికీ తెలిసిందే.  మరిపుడు జగన్ ఏర్పాటు చేసిన కొత్త వ్యవస్ధ ఆచరణలో ఎలాపనిచేస్తుందో చూడాలి. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ ఆధ్వర్యంలోని వైసిపి ప్రభుత్వం భవిష్యత్తంతా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల పనితీరు మీదే ఆధారపడుందనటంలో ఎటువంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: