ఈ ఏడు ఎక్కడ చుసిన  వానలు దంచికొడుతున్నాయి . దంచి  కొడుతున్నా వానలతో నగరాలన్నీ  జలమయం అవుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించి పోతుంది. అయితే వర్ష ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో  ఇంకాస్త ఎక్కువ ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో వరదలు రావడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ లోని  బాల్లియా,  జాన్పూర్ వారణాసి జిల్లాలపై వర్షపు  ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. భారీగా వరదలు రావడంతో జనం తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. 

 

 

 

 

 కాగా బీహార్ కి సరిహద్దులో  గంగానది కి దగ్గర్లో ఉన్న బాల్లియా  జిల్లాలోని జైల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఖైదీల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. భారీ వరదల  ప్రభావంతో ఇప్పటికే ఆ ప్రాంతంలో 27 మంది చనిపోయారు కూడా. జై లోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు అధికారులు  ప్రయత్నించినప్పటికీ మూడు బ్యారక్ లను  ముంచేసిన వరద నీరు మాత్రం ఎక్కడా తగ్గలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు ఓ  నిర్ణయం తీసుకున్నారు. 

 

 

 

 కగా  ఆ జైల్లో 350 మంది ఖైదీలు ఉండేందుకు మాత్రమే సరిపడేలా నిర్మించారు కానీ అక్కడ ప్రస్తుతం 863 మంది ఖైదీలు ఉన్నారు. జైలు పరిస్థితి కూడా అద్వానంగానే ఉంది. నాసిరకం గోడలతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. అయితే భారీ వరద నీరు వచ్చి చేరడంతో ఆ దాని పరిస్థితి ఇంకా దీన స్థితికి చేరింది. దీంతో అధికారులు నీటిని తోడి పోస్తున్న ప్రయోజనం లేదని భావించి చేసేదేమీలేక... జైల్లో ఉన్న  ఖైదీలను  వేరే ఇతర జైలుకు తరలించారు. అయితే ఇప్పటికే 500 మంది ఖైదీలను అజంఘడ్  లోని  జైలుకు తరలించగా... మిగిలిన 363 మంది ఖైదీలను అంబేద్కర్ నగర్ లోని జైలుకు తరలించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. వరదనీరు ఉద్ధృతి తగ్గిన తర్వాత మళ్లీ ఖైదీలను బాల్లియా  జైలుకు తీసుకు రావాలని అధికారులు తెలిపారు. అయితే ఈ భారీ వర్షాలతో వరదలు ఎక్కువగా రావడంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: