గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేna పార్టీ  కొన్ని సీట్లు  దక్కించుకునే కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఘోర పరాజయం పాలైంది జనసేన. ఏకంగా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో సినిమాల్లోకి వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. కానీ ప్రజల  తరఫున పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తనదైన స్టైల్ లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

 

 

 

 కాగా తాజాగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కోతలపై  స్పందించిన పవన్ కళ్యాణ్... వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన ట్విట్టర్ ఖాతాలో విద్యుత్ సమస్యలపై స్పందించారు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయని విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుందని అన్నారు. అయితే ఈ  ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేశారని... కానీ ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 

 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని... దాని ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పల్లెల నుండి నగరాల వరకూ అన్నిచోట్లా విద్యుత్ కోతలు ఏర్పడి అంతా చీకటి మయం అయిందన్నారు. రాష్ట్ర ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన మేర విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా ఈ విద్యుత్ కోతలు అనుభవించాలా.? అంటూ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: