న్యాయాన్ని రక్షించవలసిన వారే మోసాలకు పాల్పడుతుంటే సమాజంలో సాటి మహిళల మానప్రాణాలకు భద్రత ఎక్కడుంటుంది.ప్రేమ పేరుతో,పెళ్లిపేరుతో తమ వాంఛలు తీర్చుకునే కామంధుల ముందు న్యాయం నిలబడుతుందా?సమాజంలో రోజురోజుకు మానభంగాలు ఎక్కువవుతున్నాయంటే ఇక డిపార్ట్‌మెంట్‌లో కూడా తోటి ఉద్యోగి పై ఇలాంటి అఘాయిత్యాలు చేసేవారు తయారైతే ఇంకేమైనా ఉందా.ఇప్పుడు అలానే జరిగింది.



ఓ ట్రైనీ ఎస్‌ఐ నమ్మించి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేసాడు.ఈ ఘటన ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో జరిగింది. మహిళా పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న లేడీ కానిస్టేబుల్(30)తో ఓ ట్రైనీ ఎస్‌ఐకి సోషల్‌మీడియా ద్వారా పరిచయమైంది.ఆ పరిచయం ఎక్కడివరకు దారి తీసిందంటే ఇద్దరు ఛాటింగ్ చేసుకోకుండా వుండలేనంత దూరం వెళ్లింది.అసలే మగపురుగాయే  అవకాశంవస్తే ఎప్పుడు వాడుకుని వదిలేద్దామా అని చూస్తారు.అతను అనుకున్నట్లుగానే ఆ లేడి కానిస్టేబుల్, ఆ ట్రైనీ ఎస్‌ఐని తనింటికి పిలిచింది.ఆమె ఆహ్వానంతో ఆ ఎస్ఐ,కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లాడు.



అతిధి మర్యాదలు అన్ని చక్కగా జరుగుతుండగానే ఆ సమయంలో ఇంట్లో మరెవరూ లేకపోవడం గమనించిన అతను ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు.ఆమె తిరస్కరించడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక కోరిక తీర్చుకున్నాడు.ఇలా రెండు నెలలుగా వారిద్దరి మధ్య లైంగిక సంబంధం కొనసాగుతోంది.ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుతున్నా పట్టించుకోక పోవడంతో హజారీబాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.



ట్రైనీ ఎస్ఐ తనను నమ్మించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని,తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది.కోర్టు ఆదేశాల ప్రకారం..ట్రైనీ ఎస్ఐపై పోలీసులు ఐపీసీ 376(అత్యాచారం) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత నిందితుడి అరెస్ట్‌పై నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.అసలే డిపార్ట్‌మెంట్ పరువుకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఎస్పీ మయూర్ పటేల్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారట.   


మరింత సమాచారం తెలుసుకోండి: