ఇంట్లోకి చాలీ చాలని డబ్బులు వస్తున్న రేపు ఆరోగ్య సమస్య వస్తే అప్పటికి అప్పుడు వైద్యానికి డబ్బులు ఉండవు అని అనేకమంది కార్మికులు ఈఎస్ఐకి  అంటూ డబ్బు చెల్లిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీమా వైద్యసేవల విభాగం గాడి తప్పింది. అనేకమంది కార్మికులు డిస్పెన్సర్ వద్ద సమయానికి వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.             


మాత్రలు, మందులు కొనుగులా పేరిటా ప్రతిపాదనల్లో దిద్దుబాటు చేసి అధికారాలు అక్రమాలకు పాల్పడి వైద్యం కోసం వచ్చే కార్మికులకు కనీస ఔషధాలు అందుబాటులో లేకుండా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరునెల్ల నుంచి 33 ఈఎస్ఐ సాధారణ ఔషదాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. వృద్ధులు, గర్భిణులు, పుట్టిన పసికందులకు నిరీక్షణ తప్పడం లేదు.              


కొన్ని చోట్ల అయితే మరి ఘోరం. పరికరాలు అందుబాటులో ఉన్న సరే కనీస రోగా నిర్దారణ పరీక్షలు జరగడం లేదు. మరికొన్ని చోట్ల అయితే ఇంజెక్షన్లు కూడా లేవు. అసలు ఇన్ని జరుగుతున్న వారిని అడిగే వారు ఎవరు లేరు. ఈఎస్ఐ పేరిట నెల నెల చందాలు చెల్లిస్తున్న మళ్ళి అప్పు చ్చేసి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


జ్వరానికి ఇవ్వాల్సిన పారాసిటమాల్ మాత్రలు లేవు.. 


జ్వరం, కీళ్లనొప్పులు వస్తే భాద పడేవారికి ఇచ్చే మాత్ర పారాసిటమాల్. కానీ ఈ మాత్రలు కూడా ఈఎస్ఐ డిస్పెన్సరీ వైద్యుల డోలోలో మాత్రలు అందుబాటులో లేవు. ఈ మందులు కూడా లేకపోవడం కార్మికులు అంత ప్రైవేట్ మెడికల్ దుకాణాలకు వెళ్లి కొంటున్నారు. అన్ని ప్రయివేట్ లోకి వెళ్లి కొసనేలా ఉంటె ఇంకా ఈఎస్ఐకి ప్రతి నెల చెల్లించడం ఎందుకు ? అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: