రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కోతలున్న మాట వాస్తవమే. ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నా, జలాశయాలు నిండిపోయి కళకళలాడుతున్నా విద్యుత్ కోతలున్నాయంటే ఆశ్చర్యమే. కాని దాని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. అవేమిటంటే ?  బొగ్గు కొరత, విద్యుత్ పిపిఏల సమీక్షల పేరుతో పవన, సోలార్ విద్యుత్ సరఫరా ఆగిపోవటం, కేంద్రం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, భారీవర్షాలు, కార్మికుల సమ్మె, 9 గంటల విద్యుత్ సరఫరా లాంటి అనేక కారణాలున్నాయి.

 

పై కారణాలు అన్నీ ఒక ఎత్తైతే చంద్రబాబునాయుడు అవినీతి రాష్ట్రానికి తీరని శాపమైకూర్చుంది. మహారాష్ట్ర, ఒడిస్సా, బీహార్ లాంటి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. దాని ఫలితంగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయాయి.

 

విద్యుత్ కొనుగోలు ధరలను తగ్గించే ఉద్దేశ్యంతో  చంద్రబాబు గతంలో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించాలని అనుకున్నారు. అందుకు కంపెనీలు ఒప్పుకోలేదు. దాంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఫలితంగా కంపెనీలు ఉత్పత్తిని నిలిపేశాయి. దాంతో కంపెనీల నుండి వస్తున్న విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

 

ఎన్టీపిసి లాంటి ఉత్పత్తి సంస్ధలకు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వనిదే విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నట్లు కేంద్రం చెప్పింది.  బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వని ఫలితంగా కేంద్ర సంస్ధల నుండి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్ ఇచ్చేవారు. అదే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ విద్యుత్ ను 9 గంటలకు పెంచారు. దాంతో రెండు గంటల అదనపు ఉపయోగం పెరిగిపోయింది.


ఇక చంద్రబాబు హయాంలో ఉత్తరాధి రాష్ట్రాల నుండి కొనుగోలు చేసిన విద్యుత్ కు బదులు విద్యుత్ నే సరఫరా చేస్తామని చెప్పారు. దానికోసమని అత్యధిక ధరలకు సోలార్, పవన విద్యుత్ ను కొన్నారు. అదే సమయంలో తన మద్దతుదారుల కంపెనీలకు ఆర్ధిక లబ్ది చేకూర్చే ఉద్దేశ్యంతో యూనిట్ ధరలను దాదాపు 3 రూపాయలు అదనంగా చెల్లించారు. దానివల్ల వేల కోట్ల రూపాయల భారం పడింది. ఆ భారాన్ని తగ్గించుకునేందుకే  జగన్ ప్రయత్నిస్తున్నారు.  ఇప్పుడు ఎవరికి వారుగా అంచనా వేసుకోండి విద్యుత్ కోతలకు కారకులు ఎవరో .

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: