ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం ఎలా పెరిగిపోయిందో అందరికీ తెలిసిన విషయమే. ప్లాస్టిక్ మనుషుల  రోజువారి జీవితంలో ఓ భాగమైపోయింది. ప్లాస్టిక్ ని  నిషేధించాలని పూర్తిగా  నిషేదించాలని  లేకపోతే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వాలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎక్కడ మార్పు మాత్రం కనిపించడం లేదు. రోజు రోజుకి ప్లాస్టిక్ వాడకం ఇంకా  పెరిగిపోతున్న నేపథ్యంలో పర్యావరణానికి ముప్పు ఎక్కువగా వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అన్ని ప్రభుత్వాలు నడుం బిగించాయి . 

 

 

 

 వినూత్న ఆలోచనలు చేస్తూ తమ తమ దేశాలలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించి భారతీయులందరికీ అవగాహన తీసుకొచ్చారు. అయితే మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఓ ప్రభంజనం లా  జరిగింది. అయితే ప్లాస్టిక్ ని పారద్రోలి   గాంధీ కలలు కన్న స్వరాజ్యం సహకారం చేసుకోవాలని...  ఆయన జయంతి రోజు నుండి  ప్లాస్టిక్ ని  నిషేధించే  గొప్ప సంకల్పానికి స్వీకారం చుట్టాలని   మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

 

 

 

 అయితే మన దేశంలోనే  కాదు ఫిలిప్పీన్స్ లో కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని అవగాహన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వినూత్న  ప్రయత్నాలు  చేస్తూ ప్రజలు ప్లాస్టిక్ నిషేధం చేసేలా  చర్యలు చేపడుతుంది అక్కడి ప్రభుత్వం.ఈ నేపథ్యంలో  ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. రెండు కిలోల ప్లాస్టిక్ ను సేకరించి తమకు ఇస్తే దానికి బదులుగా కిలో బియ్యం ఇస్తామని ప్రకటించింది ఫిలిప్పీన్స్ లోని  ఓ గ్రామపంచాయతీ. దీంతో ప్రజలు అందరు పోటీపడి మరీ ప్లాస్టిక్ ని అప్పజెప్పి బియ్యాన్ని  తీసుకెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: