మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను పార్టీ రహితంగానే జరిగినట్లు అర్ధమవుతోంది. గ్రామ సచివాలయాల ఉద్యోగులు భర్తీ చేస్తామని చెప్పినప్పటి నుండి అన్నీ వైసిపి వాళ్ళకు ఇచ్చుకునేందుకే అంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఆరోపణలు చేస్తున్న విషయం చూస్తున్నదే.

 

కానీ ఉద్యోగాలకు ఎంపికైన వారిని చూస్తే పార్టీ రహితంగానే ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉద్యోగాలకు ఎంపికైన వారిలో టిడిపిలో బాగా యాక్టివ్ గా పనిచేసిన వారు కూడా ఉన్నారు. గడచిన ఐదేళ్ళల్లో తెలుగుదేశంపార్టీ తరపున సర్పంచులు, ఎంపిటిసిలుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. అలాగే కొన్ని మండలాల్లో సీనియర్ నేతల పిల్లలు కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయాలను వాళ్ళే స్పష్టంగా చెప్పారు.

 

జగన్ అధికారంలోకి రాగానే భర్తీ చేసే ఉద్యోగాలన్నీ వైసిపి వాళ్ళకే వెళతాయని తాము కూడా అనుకున్నట్లు ఇమాంపురంకు చెందిన వెంకటలక్ష్మి చెప్పింది.  ఈమె ఐదేళ్ళు సర్పంచుగా పనిచేసింది.  మొన్నటి పరీక్షలో  పంచాయితీ గ్రేడ్-5 పోస్టుక ఎంపికయ్యింది. విజయనగరం జిల్లాలోని సతివాడ గ్రామానికి చెందిన రెడ్డి సురేష్ కూడా పంచాయితీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. సురేష్ కుటుంబంలోని చాలామంది టిడిపిలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఈయన ఉద్యోగానికి ఎంపికవ్వటం గమనార్హం.

 

కృష్ణాజిల్లాలోని జువ్వనపూడి మండలం ఎంపిటిసిగా పనిచేసింది యు. నాగలక్ష్మి. టిడిపి ఎంపిటిసిగా పనిచేసిన తనను ప్రభుత్వం ఎంపిక చేయదనే అనుకుందట. కానీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ అండ్  గ్రామ మహిళా పోలీసుగా ఎంపికైనట్లు తెలిసి ఆశ్చర్యపోయింది.  కె. అపర్ణది అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని చందకచర్ల గ్రామం.

 

తన తండ్రి టిడిపి సీనియర్ నేత అయినప్పటికీ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సెలక్టయ్యింది.  మేడిది రమాదేవిది నరసాపురం. తన తండ్రి సీనియర్ టిడిపి నేతగా గుర్తింపున్న వారు. అయినా తనకు హార్టికల్చర్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. తనకు ఉద్యోగం రాదనే అనుకున్నట్లు చెప్పింది. ఇలా చాలామంది ఇదే విధంగా తమ ఆలోచనలను చెబుతున్నారు. వీళ్ళు చెబుతున్నది చూస్తుంటే జగన్ చెబుతున్నట్లే ఎంపికలన్నీ పార్టీ రహితంగానే జరిగినట్లు అర్దమవుతోంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: