నాన్నంటే.భరోసాతో వచ్చే భద్రత..భద్రతతో కూడుకున్న బాధ్యత.తండ్రితో ప్రతి వారికుండేది ఒక రిలేషన్ మాత్రమే కాదు.అది ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్..చేయి పట్టుకుని నడక నేర్పినప్పుడు..గాల్లోకి ఎగరేసి ఆడించినప్పుడు ఆయన కళ్లల్లో వెలిగే వెలుగు ఎప్పుడూ తెలియదు.ఇలా పెంచిన తండ్రి ఓ కీచకునిగా మారుతాడని ఎవరైనా ఊహిస్తారా.తండ్రి అంటే గౌరవంతో కూడిన భయం వుంటుంది కాని,భయంతో పారిపోవాలనిపించేటంత మొండితనం ఎవరిలో వుండదు.ఎందుకంటే అతడు తండ్రి కాబట్టి. కాని ఇక్కడొక కీచకుడు తన కంటిరెప్పనే కాటేసాడు.పెంచిన చేతులతో కూతురు జీవితాన్ని తుంచేసాడు.



గాయాన్ని మానిపేవాడు తండ్రి అనుకుంటే, ఎన్నటికి మాయని గాయాన్ని చేసిన వాన్ని ఏమంటారు.నాన్న అని ఆ పదానికున్న విలువ మాత్రం తీయవద్దు.ఎందుకంటే విలువ తెలిసినవాడు దానివిలువ తగ్గించడు.కాని ఈ రాక్షసుడు ఇలా ఆలోచించలే అత్యంత కిరాతకంగా కన్న కూతురితో ఆరుగురు పిల్లల్ని కన్నాడు.కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన కూతురిపైనే కామంతో అత్యాచారానికి పాల్పడ్డాడు.అలా వీలు చిక్కినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతూ కన్నకూతురినే తల్లినిచేశాడు.సభ్యసమాజం తలదించుకునేలా వున్న ఈ ఘటన జరిగింది యూకేలో..



సౌత్ వెస్ట్ వేల్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన సంతానంలో ఒకరైన 16ఏళ్ల బాలికపై ఎంతో కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.తండ్రితో శృంగార జీవితాన్ని పంచుకుంటే స్వర్గలోకానికి వెళ్తారంటూ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతున్నాడట,ఆ కిరాతకుడు..అంతేకాకుండా తన స్నేహితుల ఇంటికి తీసుకెళ్లి వారితో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడట.ఈ కేసు విచారణ సందర్భంగా తండ్రి చేతిలో అఘాయిత్యానికి గురైన బాలిక ఇచ్చిన వాంగ్మూలం అందరినీ కంటతడి పెట్టించింది.తనకు ఊహ తెలిసినప్పటి నుంచే తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని,అతడి వల్ల ఆరుగురికి జన్మనిచ్చి నట్లు తెలిపింది.



తండ్రి వారానికి కనీసం మూడుసార్లు తనతో సెక్స్ చేసేవాడని,కారులో,బెడ్‌రూమ్‌లోనే కాకుండా ఒక్కోసారి బీచ్‌కి తీసుకెళ్లి అక్కడ కూడా అత్యాచారం చేసేవాడని వెల్లడించింది. ఒకసారి తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అతనితో కూడా తనపై అత్యాచారం చేపించాడని,ఇలా తన శరీరంతో వ్యాపారం చేస్తూ,ఎంతో మంది విటులను ఇంటికే తీసుకొచ్చి వ్యభిచారం చేయించేవాడని చెప్పి కన్నీరు పెట్టుకుంది.అత్యంత విషాదకరమైన ఈమె గాధవిన్న ఎన్నో హృదయాలు చెమ్మగిల్లాయి.ఇక ఈ సంఘటన చదివాక ఇలాంటి తండ్రులు వుంటే ఎంత లేకుంటే ఎంత అని అనుకోని వారుండరు.


మరింత సమాచారం తెలుసుకోండి: