ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చంటూ అమెరికా  భారత్ ను హెచ్చరించింది. ఈ హెచ్చరికలకు అర్ధమేంటి ? ఇండియాపై ఎటాక్ చేసేంత సాహసానికి పాకిస్థాన్ ఒడిగడుతుందా? 370 ఆర్టికల్ రద్దు తర్వాత టెర్రరిస్టులు దాడులు జరిగే ప్రమాదం  ఉందా? భారత్ పై ఉగ్రదాడుల విషయంలో అమెరికా ఆందోళనకు కారణం ఏంటి? ఒకవేళ పాకిస్థాన్..ఇండియా వార్ అనివార్యమేతే చైనా  ఎటువైపు నిలిచే ఛాన్స్ ఉంది?


జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భారత్‌లో పాకిస్థాన్‌ ఉగ్ర దాడులు జరిపే ఛాన్స్  ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్ర సంస్థలను పాక్‌ కట్టడి చేయకపోతే ముష్కరులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని ఉగ్రవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఐతే...భారత్‌లో పాక్‌ ఉగ్రవాదులు దాడులు చేయడానికి కుట్రలు పన్నారనే అనుమానం వ్యక్తం చేసింది అమెరికాకు చెందిన  డిఫెన్స్ అకాడెమీ. ఉగ్ర సంస్థలను పాక్‌ కంట్రోల్ చేయకపోతే భారత్‌లో ఖచ్చితంగా దాడులు జరుగుతాయని యూఎస్ స్పష్టం చేసింది. ఈ  విషయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇవ్వకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. దౌత్య, రాజకీయ పరంగానే పాక్‌కు చైనా మద్దతు ఇవ్వొచ్చు. ఐతే... ఉగ్రసంస్థలను పోషించడంలో మాత్రం చైనా పాకిస్థాన్ కు సహకరించకపోవచ్చని తెలిపింది. 


ఇక...అమెరికా రక్షణ శాఖ ఇండో పసిఫిక్‌ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్‌ సెక్రటరీ రాండాల్ శ్రీవర్... టెర్రర్ ఎటాక్స్ పై కీలక  విషయాలను వెల్లడించారు. ఆర్టికల్‌ 370, 35ఎ రద్దు విషయంలో పాక్‌ చేస్తున్న ఆరోపణలకు చైనా మద్దతుపై శ్రీవర్‌ స్పందించారు. దౌత్య,  రాజకీయ అంశాలలో మాత్రమే పాక్‌కు చైనా మద్దతు ఇస్తుందని తాము భావిస్తున్నామని తెలిపారు. భారత్‌తో స్నేహానికి చైనా సిద్దంగా ఉందని  స్పష్టం చేశారు. కొన్ని విషయాలలో మాత్రమే చైనా పాక్‌కు మద్దతు ఇస్తుందని శ్రీవర్‌ అభిప్రాయపడ్డారు. మొత్తానికి...పాకిస్థాన్ ఇండియాపై చేస్తున్న ఉగ్రకుట్రలపై యూఎస్ హెచ్చరికలు జారీ చేయటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఏం  జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.




మరింత సమాచారం తెలుసుకోండి: