ఉత్తరాదిలో వరద తగ్గినా.. కష్టాలు తగ్గలేదు. రోడ్లు నదులుగా మారాయి. తిండిలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో వరద కష్టాలు సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి. వరదలో చిక్కుకుని.. నరకయాతన పడుతున్నారు ఆ రాష్ట్ర ప్రజలు. వందల మందిని బలిగొన్న వరద.. లక్షల మందిని నిరాశ్రయులను చేసింది.


యూపీ, బీహార్‌లో వందేళ్లలో లేని విధంగా వర్షపాతం నమోదైంది. ఈ రెండు రాష్ట్రాల్లో  వర్షాల ధాటికి 148 మందికి పైగా మరణించారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎడతెగకుండా కురిసిన వర్షాలకు బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రజలు తిండి లేక నానాతంటాలు పడుతున్నాయి. రోడ్లపై నీళ్లు నదుల్లా ప్రవహిస్తున్నాయి. జలదిగ్భంధంలో చిక్కుకున్న ప్రజలు తిండిలేక నానా తంటాలు పడుతున్నారు. రెస్క్యూ టీంలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.


పాట్నాలోని చాలా ప్రాంతాలు నీటిలోనే నానుతున్నాయి. పాట్నాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో  వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించారు అధికారులు. రోడ్లపై నీటిని యంత్రాల ద్వారా తొలగిస్తున్నారు అధికారులు.  నిత్యావసర వస్తువులు లేక అల్లాడుతున్నారు పాట్నావాసులు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారిని బోట్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి రెస్క్యూ టీంలు.


వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించింది బీహార్‌ ప్రభుత్వం. అధికారులకు సెలవులను రద్దు చేసింది. భారీ వరదల కారణంగా యూపీ,  బీహార్‌లో జరిగిన నష్టం పైన ప్రధాని మోడీ ఆరా తీసారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు బాదితుల్ని పునరావస శిబిరాల్లోనే ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి అక్కడ కురుస్తున్న వర్షాలు.. ఆ వర్షాలకు తోడు వరదలు అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 






మరింత సమాచారం తెలుసుకోండి: