ఏపిలో జగన్ ప్రభుత్వం ప్రతిపనిలో చిత్తశుద్ధి,పారదర్శకతతో ముందుకు వెళ్తుందని,నాలుగు నెలల పాలనలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి,గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేదలకు అండగా సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకుంటూ,అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం లక్ష్య మని,ఈనోటా,ఆనోటా వినిపిస్తున్న మాట.



ఇక ఈదశలో గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టుల విషయంలో మరో నిర్ణయం జగన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.అదేమంటే ఏపీలో గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి విద్యార్హతను తగ్గించే అవకాశముందట.గ్రామ వాలంటీర్ పోస్టులకు సంబంధించి అక్టోబరు 1న అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని,గ్రామ/వార్డు వాలంటీర్లుగా పనిచేస్తూ ఉండి.సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైతే..ఏర్పడే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.అవసరమైన పక్షంలో అర్హతలు తగ్గించే విషయాన్ని కూడా పరిశీలించాలని తెలిపారట.



అధికారులతో వాలంటీరు పోస్టుల్లో ఖాళీ అనే మాటే వినిపించకూడదని,అందుకోసం వాలంటీర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియ ట్‌‌ను అర్హతగా నిర్ణయిస్తే..మిగిలిపోయిన ఖాళీలను సులభంగా భర్తీ చేయవచ్చన్నారు సీఎం జగన్.ఎందుకంటే వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉంటే.. ప్రభుత్వం లక్ష్యం నెరవేరదు కాబట్టి,అక్టోబరు 15 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తికావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఇకపోతే గ్రామ సచివాలయాల్లో భాగంగా సర్వేయర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.



ఇందుకోసం ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి,సర్వే విభాగానికి సంబంధించిన వివిధ అంశాల్లో అంటే ముఖ్యంగా సర్వే హద్దుల గుర్తింపు,ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌ వినియోగం,క్యాడ్‌ సాఫ్ట్‌వేర్ అంశాల్లో శిక్షణ కొనసాగనుందని తెలిపారు..అవినీతిరహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి లక్ష్యమని అందుకోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలంటే గ్రామస్థాయి ఉద్యోగులు ధృడసంకల్పంతో పనిచేయాలని  అధికారులు సూచించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: