ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా టీడీపీపై ఓ రేంజ్‌లో ఆగ్రహాన్ని ప్రదర్శించారు.గురువారం ఆయన జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామి రెడ్డి,పార్లమెంటరీ అధ్యక్షుడు సురేశ్‌బాబులతో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ.దద్దమ్మల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమేని.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి,ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.



ఇక క్రిమినల్ కేసులు నమోదైన టీడీపీ కార్యకర్తకు మాజీ సీఎం చంద్రబాబు వంత పాడటం విడ్డురంగా ఉందని దుయ్యబట్టారు. ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు.అంతే కాకుండా గతంలో టీడీపీలో ఉన్నవారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.కార్మికుల కష్టాలు చూడలేక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని అన్నారు.



సచివాలయ ఉద్యోగాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని,సీఎం జగన్‌కు రోజు రోజుకు ప్రజాదరణ పెరిగిపోతున్న క్రమంలో ఓర్వలేకే టీడీపీ అనవసరంగా నోరుపారే సుకుంటుందని ఆరోపించారు.ముద్దు కృష్ణంనాయుడుపై ఎన్నో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని,అలాంటి వ్యక్తికి బాబు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన కృష్ణంనాయుడిని మైదుకూరు టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఇక చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అన్ని అబద్దాలేనని,బాబు అసత్య ప్రచారాలు చేయడంలో ఎప్పుడు ముందుంటారని విమర్శించారు.ఇక చంద్రబాబు అవినీతి,దుబారా ఖర్చులతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని,అన్న క్యాంటీన్ల నిర్మాణం లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కృషిచేస్తూ,ప్రజారంజక పాలన చేస్తున్న ప్రభుత్వంపై నోటి కొచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదని అంజాద్ బాషా సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: