ఓ మనిషి బతకాలంటే అతని బాడీ లోని అవయవాలన్నీ సక్రమంగా ఉండి సక్రమంగా పని చేయాలి. అవయవాలు పని చేయడంలో ఏదైనా తేడా వచ్చినా కానీ లేదా అవయవాలు సక్రమంగా లేకపోయినా కానీ మనిషి బతకడం చాలా కష్టమే. అయితే ప్రతి మనిషికి గుండె ఎడమ వైపు ఉంటుంది. కాలేయం ఎడమవైపు ఉంటుంది. ప్రతి మనిషికి ఇలాగే ఉంటుంది ఒకవేళ ఇలా లేకుండా వేరేలా ఉంటే  మనిషి బతకడం కష్టమే అంటారు డాక్టర్లు. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రం గుండె కుడి వైపు ఉంది. కడుపునొప్పితో హాస్పిటల్ కి వచ్చిన ఆ వ్యక్తిని  పరీక్షించిన వైద్యులు  ఈ విషయం తెలిసి ఆశ్చర్య పోయారు. 

 

 

 

 

 

 ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడి వైపు ఉండటం...కుడి వైపు ఉండాల్సిన కాలేయం ఎడమ వైపు ఉండటం...అంతేకాకుండా  అతడి శరీరంలోని చాలా అవయవాలు వాటి స్థానాల్లో  కాకుండా వేరే చోట  ఉండటం డాక్టర్లను షాక్ కి గురి చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ పాద్రౌనా  లో జరిగిన ఈ ఘటన అక్కడి డాక్టర్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఖుషి నగర్లోని పాద్రౌనాకు చెందిన జమాలుద్దీన్ అనే వ్యక్తి ఇటీవలే కడుపు నొప్పి రావడంతో గోరఖ్ పూర్  లోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. అయితే జమాలుద్దీన్ కి   అక్కడి వైద్యులు  ఎక్స్ రే,  అల్ట్రాసౌండ్ పరీక్షలు చేశారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా... జమాలుద్దీన్   రిపోర్ట్ ను చూసి డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

 

 

 

 

 

 

 ఎందుకంటే జమాలుద్దీన్ గుండె  ఎడమ వైపు ఉండాల్సింది కుడి వైపు  ఉండటం...కాలేయం ఎడమ వైపు ఉండటం...  అతనిలోని చాలా భాగాలు వాటి వాటి స్థానాల్లో కాకుండా వేరే చోట ఉండటంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. జమాలుద్దీన్ పిత్తాశయంలో రాళ్లు ఉండటంతోనే కడుపునొప్పి వచ్చిందని గుర్తించిన వైద్యులు... శస్త్రచికిత్స చేయడానికి నిర్ణయించగా... అందరి మనుషుల్లాగా కుడి వైపు కాకుండా ఎడమ వైపు ఉండడంతో ఆపరేషన్ చాలా కష్టమని వైద్యులు తెలిపారు. మూడు రకాల ల్యాప్రోస్కోపిక్  యంత్రాలను ఉపయోగించి మరి జమాలుద్దీన్ కు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని వైద్యులు  తెలిపారు. కాగా ఇలాంటి కేసును తామెప్పుడూ చూడలేదని అక్కడి వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: