ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన క‌ళ్లు బైర్లు క‌మ్మే వార్త ఇది. ఫోర్బ్స్‌ జాబితాలోకి ఎక్కిన చైనా కుబేరుడు జాక్‌మా కన్నా ఎక్కువ సంపాదించిన అవినీతిప‌రుడి లెక్క ఇది. ఇంత‌కీ ఆయ‌న ఏం చేస్తాడో తెలుసా? ప‌్ర‌భుత్వ అధికారి. వామ‌ప‌క్ష పార్టీ నేత‌. అవినీతిపై ఉక్కుపాదం మోపే దేశాల్లో చైనా ఒకటి అనే పేరున్న‌ప్ప‌టికీ....ఆ దేశ అధికార పార్టీకి చెందిన నాయకుడు జాంగ్‌కీ! అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏకంగా అవినీతి సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నాడు.అక్షరాలా రూ.2.65 లక్షల కోట్లు! అతడి ఆఫీసులు, నివాసాల్లో జరిపిన సోదాల్లో రూ.4 వేల 500 కోట్ల విలువైన 13.5 టన్నుల బంగారం బయటపడింది. ఇది ఆయ‌న అవినీతి సామ్రాజ్యం స‌త్తా.


మన దేశంలోని రెండు రాష్ట్రాల బడ్జెట్‌కు సమానం అయిన మొత్తాన్ని సంపాదించిన ఈ అవినీతిప‌రుడు జాంగ్‌కీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. హైనన్‌ ప్రావిన్స్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ఆయ‌న‌పై  అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అతడి నివాసాల్లో సోదాలు జరిపితే.. టన్నుల కొద్దీ బంగారు ఇటుకలు దొరికాయి. అతడి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.2.65 లక్షల కోట్ల అవినీతి సొమ్మును గుర్తించారు. ఇవికాకుండా లంచం కింద కొంతమంది దగ్గర్నుంచి విలాసవంతమైన విల్లాలను తీసుకున్నాడు.

కాగా, తూర్పు చైనాలో పుట్టిన జాంగ్‌కీ.. 1983లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. హైవాన్‌ ప్రావిన్స్‌లోని సాన్యా సిటీ డిప్యూటీ మేయర్‌గా, డాంగ్జో సిటీ మేయర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ హైకో సిటీ సెక్రటరీగా కొన్నాళ్లు ఉన్నాడు. అధికార దుర్వినియోగానికి అందినకాడికి దండుకున్నాడు. అవినీతి బాగోతం బయటపడటంతో చైనా ప్రభుత్వం జాంగ్‌కీని అన్ని పదవుల నుంచి తప్పించింది. ఏసీబీ అధికారులు జాంగ్‌ కీని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. జాంగ్‌కీ ఇంట్లో దొరికన బంగారు బిస్కెట్లను లెక్కిస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్‌ అయింది. అయితే ఈ వీడియోపై చైనాలో నిషేధం విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: