తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దసరా వేళలో ఊర్లోకి వెళ్లి పండుగను హ్యాపీగా జరుపుకుందామని బయలుదేరుతున్న ప్రజలకు ఆర్టీసీ సమ్మె పేరుతో భారీ షాక్ తగలడంతో దిగాలు చెందుతున్నారు ప్రయాణికులు. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారులు కూడా భారీగా రేట్లు పెంచడంతో భాగ్యనగరం నుంచి ఊళ్లోకి బయలుదేరిన సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 

 

 

 అయితే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల తో జరిపిన చర్చలు విఫలమవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే డ్రైవర్లు కండక్టర్లు కావాలంటూ పత్రిక ప్రకటన కూడా చేసింది ప్రభుత్వం. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆర్టీసీ సమ్మె మొదలుపెడుతున్నామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచే అద్దె బస్సులు ప్రైవేటు బస్సులు నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

 

 

 

 

 వివిధ ముఖ్యమైన మార్గాల్లో ప్రైవేటు బస్సు లో అద్దె బస్సులు నడపనున్నట్లు... ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వ  ప్రత్యేక కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఒక వేళ అవసరమైతే పాటశాలల  బస్సులను కూడా నడుపుతామని... ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా... ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు  ప్రయాణికుల నుండి వసూలు చేయొద్దంటూ  ఇప్పటికే హెచ్చరించినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ... ఈ దసరా సీజన్లో పూర్తిస్థాయిలో ప్రయాణికులు ఇబ్బందులు తీరుతాయా లేదా అన్నది మాత్రం అనుమానమే.

మరింత సమాచారం తెలుసుకోండి: