రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో నగర ప్రయాణికుల పరిస్థితి ఆగమాగం కానుంది . ఎందుకంటే దసరా పండుగ నేపథ్యంలో ఎక్కువగా ప్రయాణాలు ఉంటాయి కాబట్టి... ఆర్టీసీ సమ్మె  తో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే  ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా ఉందని తమ ఉద్యోగాలకు రక్షణ లేదని... తెలంగాణలో ఆర్టీసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వలే  ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై స్పందించిన ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఐఏఎస్ ల  కమిటీ ఆర్టీసీ కార్మికుల తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ఐఏఎస్ ల  కమిటీ చర్చల్లో  అంగీకరించలేదు. దీంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అయితే తెలంగాణ ఆర్టీసీ సమ్మె పై సర్కార్ ఆగమేఘాలపై స్పందించింది. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల చర్చల కోసం నియమించిన త్రిసభ్య కమిటీ కాసేపట్లో కేసీఆర్ ను కలిసి... కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి  కేసీఆర్ కు  వివరించనున్నారు. అయితే అందుబాటులో ఉన్న మంత్రులు ప్రగతి భవన్ చేరుకోవాలని సీఎం ఆఫీస్ నుంచి ఇప్పటికే కాల్స్ వెళ్లాయట కూడా . కాగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సమీక్షించిన అనంతరం ప్రభుత్వం  రాత్రికిరాత్రే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగానే  తమను ప్రభుత్వం లో విలీనం చేసి వేతనం పెంపు తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనేది  కార్మికుల ప్రధాన డిమాండ్ గా ఉండగా... మరి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: