సైరా మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దసరా సీజన్ కాబట్టి లాభాల బాట పట్టినా ఆశ్చర్యం లేదు. ఇక సైరా మూవీని ప్రతిష్టాత్మకంగా  తీసుకున్ననని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకున్నారు. కానీ అంతకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది పరుచూరి బ్రదర్స్. ఈ స్క్రిప్ట్  మీద వారు ఏకంగా చ్పాతిక ముప్పయ్యేళ్ళు కూర్చుని మరీ పని చేశారు. కధతో పాటు డైలాగ్ వర్షన్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు.


మరి ఇపుడు జనం చూస్తున్న సైరా మూవీలో పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ ఎంత అన్న  ప్రశ్న వేసుకుంటే సమాధానం చాలా తక్కువ అని వస్తుంది. పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కి అన్ని రకాలైన మార్పులు చేర్పులు చేసేశామని ఏకంగా చిత్ర డైరెక్టర్ సురేందర్ రెడ్డి మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ ని మార్చి సురేందర్ రెడ్డి  కొత్త వర్షన్లు రాయించాడు. దాని మీద అనేక మంది చేయి తిరిగిన రచయితలు పనిచేశారు.


ఇక పరుచూరి  స్క్రిప్ట్ట్ ప్రకారం చూసుకుంటే కధకు చరిత్రకు  ఎక్కడా అన్యాయం జరగలేదని అంటారు. చరిత్రను అలాగే ఉంచి పరుచూరి స్ర్కిప్ట్ తయారు చేశారు. దాంతో అందులో చరిత్ర కనిపిస్తుందని అంటున్నారు. అయితే కొత్త వర్షన్లో మాత్రం మెగా ఇమేజ్ ద్రుష్టిలో పెట్టుకుని ఆయన్ని ఎలివేట్ చేస్తూ సీన్లు తెచ్చారని అంటున్నారు. దానివల్ల అసలు కధ కనిపించకుండా పోయిందని, చరిత్రకు దూరంగా సినిమా తయారైందని చెబుతున్నారు.


కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చరిత్రను వక్రీకరించారన్న మాటలు కూడా ఉన్నాయి. ఇక ఉయ్యాలవాడ యుధ్ధ సన్నివేశాలు,  ఆయన డైలాగులు ఇవన్నీ కూడా ఒక మహరాజు లెవెల్లోకీ తీసుకెళ్ళారని చెబుతున్నారు. దాంతో ఒక పాలెగాడి కధ కాస్తా మెగా కధగా మరి అసలు స్వరూపం మారిందని అంటున్నారు. ఏది ఏమైనా ఇపుడు బయోపిక్కులు తీస్తే ఇలాగే తీయాలి అన్న సూత్రాన్ని మాత్రం సైరా స్క్రిప్ట్ కర్తలు చూపించారని అంటున్నారు. మొత్తానికి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అదే పదివేలు అంటున్నారంతా.



మరింత సమాచారం తెలుసుకోండి: