మోడీ జగన్ కలిసారంటేనే రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలుతాయి. ఈ ఇద్దరూ కలసి ఏం మాట్లాడుకున్నారన్న ఆసక్తి అలాంటిది మరి. ఎవరికి తోచిన కధలు వూహాగానాలు ఇలా జోరుగా ఉంటాయి. మోడీ దేశానికి ప్రధాని, నేను ఏపీకి ముఖ్యమంత్రి. మేము ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే అందులో  విశేషం ఏముంటుందని ఢిల్లీ మీడియాకు జగన్ ఎపుడో క్లాస్ పీకారు. అయినా సరే ఈ ఇద్దరు భేటీలో రాజకీయాలు ఉంటాయని, టార్గెట్ గా ఉమ్మడి శత్రువు ఉంటారని ఎవరి వూహాగానాలు వారివి మరి.


నిజానికి ఈ భేటీని తలచుకుని టీడీపీ ఉలిక్కిపడుతోంది. జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడల్లా ఆయన కేసుల ప్రస్తావన తీసుకురావడం అందులో భాగమే. టీడీపీ అధికార ప్రథినిధి పంచుమర్తి అనూరాధ జగన్ తన సీబీఐ కేసుల మాఫీ కోసమె ఢిల్లీ అర్జంట్ గా వెళ్ళి ప్రధానిని కలుస్తున్నారని అపుడే ఘాటు కామెంట్స్ చేశారు.  నిజానికి జగన్ కేసుల కధ ఈనాటిది కాదు. అది కాంగ్రెస్ తో మొదలై ఇప్పటికి ఎనిమిదేళ్ళుగా సాగుతోంది. అందులో  కనుక పస ఉంటే ఈ పాటికే ఆవి ఒక లెక్కలో తేలేవి అంటున్న వారూ ఉన్నారు.


జనం కూడా వాటిని నమ్మలేదనడానికి జగన్ బంపర్ మెజారిటీతో గెలవడమే ఉదాహరణ అంటున్నారు. మరి ఇన్ని రుజువులు వున్నా టీడీపీకి, దాని అనుకూల మీడియాకు ఎక్కడలేని పూనకం వచ్చేస్తోంది. జగన్ మోడీకి సాగిలపడ్డారని, తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాధేయపడుతున్నారని ప్రచారం చేయడమే వాటి పనిగా ఉంది. అయితే జగన్ ఏపీ అభివ్రుధ్ధికి నిధుల కోసం అడిగేందుకే ప్రధానిని కలుస్తున్నారని అంటున్నారు. అదే సమాయంలో ఏపీకి విభజన హామీల్లో రావాల్సినవి, చేయాల్సిన హామీలు ఇవి కూడా ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు.


ఇక ఈ నెలలో వైఎస్సార్ రైతు భరోసా పధకం ప్రారంభానికి కూడా ప్రధానికి ఆహ్వానించడం కూడా జగన్ భేటీలో మరో ముఖ్య వుద్దేశ్యమని అంటున్నారు. అమరావతి, పోలవరం కూడా ప్రధానితో చర్చల సందర్భంగా వస్తాయని కూడా అంటున్నారు.  మొత్తం మీద చూసుకుంటే జగన్ టూర్ పూర్తిగా ఏపీ అభివ్రుధ్ధి మీదనే ఉందని చెబుతున్నారు. . చూడాలి ఈ భేటీలో ఇంకేం మాట్లాడుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: