గత అర్థరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుగా ఉంచగా  ప్రభుత్వం కార్మికుల డిమాండ్స్ పై  సానుకూలంగా స్పందించకపోవడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైంది. తమ డిమాండ్లను పరిష్కరించే  వరకు సమ్మె విరమించేది లేదని తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపునిచ్చింది. అయితే కార్మికుల సమ్మె పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు సమ్మె విరమించి కార్మికులు విధుల్లో పాల్గొనాలని అలా పాల్గొన్న వారిని ఆర్టీసీ కార్మికులుగా పరిగణించి మిగతా వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అల్టిమేటం కూడా జారీ చేసారు

 

 

 

 

 

 అయితే దసరా పండుగ దృశ్య ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అద్దె బస్సులను ప్రైవేటు వాహనాలను నడిపేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి వాటిని అమలు చేస్తుంది. అయితే ప్రైవేట్ వాహనాలను ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టి డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు పోలీసులు.ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  కెసిఆర్ కార్మికులకు మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈరోజు ఉదయం ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్  ఆర్టీసీ సమ్మె పై చర్చించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించి వెంటనే విధుల్లోకి రావాలని... సీఎం సూచిస్తున్నారు. 

 

 

 

 

 ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి... కొన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి  కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే కేసీఆర్ తీసుకునే కొత్త నిర్ణయంతో కార్మికులు విధులకు హాజరైన,  హాజరు అవ్వక పోయినప్పటికీ... ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సాధ్యమైనన్ని ఎక్కువ బస్సు తిప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా  నగరంలో ఆర్టీసీ సమ్మెతో మెట్రో స్టేషన్లను కిటకిటలాడుతున్నాయి. నగరంలోని ఏ మెట్రో  స్టేషన్ లో చుసిన  ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: