పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి బలమైన నేతలు ఒక్కొక్కరుగా ఈపుడు జారుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్నటికి నిన్న విశాఖ జిల్లాకు చెందిన  సీనియర్ నేత చింతల  పార్ధసారధి పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు కూడా పలువురు జనసేనకు గుడ్ బై కొట్టేశారు, టీవీ డిబేట్లలో పవన్ని పూర్తిగా డిఫెండ్ చేస్తూ మంచి వాక్చాతుర్యంతో అందరినీ కట్టడి చేసే అద్దేపల్లి శ్రీధర్ లాంటి వారు చాలా రోజుల క్రితమే పార్టీ నుంచి తప్పుకున్నారు.


ఇపుడు చూస్తే గోదావరి జిల్లాల్లో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, జనసేన తరఫున తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధిగా రాజమహేంద్రవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయిన ఆకుల సత్యనారాయణ గట్టి షాక్ ఇచ్చారు. ఆయన జనసేనకు గుడ్ బై కొట్టేసారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన పవన్ కి ఓ లేఖ రాశారు. ఇక ఆయన సతీమణి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా జనసేన త‌రఫున పోటీ చేసి ఓటమి పాలు అయిన పద్మావతి కూడా జనసేనకు రాజీనామా చేస్తూ లేఖ రాశారు.


ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం లో బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన ఆకుల సత్యనారాయణ దంపతులు వైసీపీలో చేరుతారని అంటున్నారు. అందుకు   సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యారని తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారని అంటున్నారు. దాంతో దసరా రోజున ఆకుల దంపతులు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఆకుల జనసేనకు రాజీనామా చేయడం పవన్ పర్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇలా సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో జనసేనకు కొత్త ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు. మరి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: