రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగే తెలంగాణ ఆర్టీసినీ  కూడా ప్రభుత్వంలో విలీనం చేసి వేతన పెంపుతో పాటు ఉద్యోగ భద్రత  కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కి మధ్య చర్చలు కూడా జరిగాయి.అయితే  ఈ చర్చల్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను త్రిసభ్య కమిటీ అంగీకరించకపోవడంతో సమ్మె అనివార్యమైంది. గత అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు సమ్మె  మొదలుపెట్టారు. అయితే ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో దసరా పండక్కి ఊళ్లకు వెళ్లేందుకు బయలుదేరిన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేటు అద్దె  వాహనాలు నడుపుతున్నప్పటికీ  పూర్తి స్థాయిలో మాత్రం ప్రయాణికులు ఇబ్బందులు తీరడం  లేదు. 

 

 

 

 

 కాగా  రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపు విధుల్లో చేరిన వారినే ఆర్టీసీ ఉద్యోగుల భావిస్తామని మిగతావారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ హెచ్చరించారు. అయితే మరో వైపు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించే  వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో మహబూబాబాద్ లో ఓ  ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.

 

 

 

 

 ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన తోనే ఆ డ్రైవర్ సూసైడ్ చేశారని తెలుస్తోంది. కాగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో  ప్రైవేటు వాహనదారులు  కూడా భారీగా ఛార్జీలు పెంచి ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: