ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత రాత్రి సమ్మో చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ గత రాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెతో డిపోలకే పరిమితమయ్యాయి. తమ డిమాండ్లకు ప్రభుత్వం సరైన పరిష్కారం వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. అయితే పండుగా సమయం కావడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు.  


ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో నివసించే వారు పండుగ సమయంలో ఊరు వెళదాం అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక ప్రైవేట్ వారు వారికీ దోచినంత దోచుకోడానికి 500 టికెట్ ధరను 2 వేలకు పెంచి ప్రయాణికులకు పండుగా చుక్కలు చూపిస్తున్నారు. పండుగాకు ఊరు వెళ్లే వారి సంగతి పక్కన పెడితే నగరంలో ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి మరి ఘోరంగా తయారయ్యింది. 


హైదరాబాద్ లో జీవించేవారు దాదాపు 60 శాతం మంది సిటీ బస్సులోనే ప్రయాణిస్తుంటారు. అలాంటి వారికీ ఈరోజు చుక్కలు కనిపించాయి. 10 రూపాయలతో ఆఫీసులకు వెళ్లే వారికీ వందల్లో చార్జీలు వేశారు ఆటో వాళ్ళు. క్యాబుల వారు అయితే ఇంకా చెప్పలేనంత రేటు వేశారు. ఆటోలు, క్యాబ్ లలో వెళ్లలేని వారు మెట్రోకీ వెళ్లారు. దీంతో ఈరోజు మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. 


మెట్రో స్టేషన్ లో కాలు పెట్టెకి కూడా లేకుండా పోయింది. దీంతో మూడు నిమిషాలకు ఒక మెట్రో తిరిగింది. అయితే ఈ మెట్రోకీ భారీగా జనాలు రావడంతో పలువురు ప్రయాణికులకు గాయాలు తగిలియి. ఆ రద్దీ కారణంగా ఓ ప్రయాణికురాలు కింద పడటంతో ఆ ప్రయాణికురాలుని రద్దీలో తొక్కేశారు. అయితే స్టేషన్ రాగానే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈమెకే కాకా చాలామంది మెట్రో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఇంకా ఇప్పుడు పండుగ సెలవలు కారణంగా మెట్రోలో ప్రయాణికులు తక్కువ మంది ఉన్నారు కానీ లేకుంటే ప్రయాణికులకు మెట్రో ట్రైన్ కూడా సరిపోయేది కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె విషయాన్నీ ఎం చేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: