తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జోరుగా  సాగుతోంది. తెలంగాణలోని అన్ని డిపోల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వలే  తెలంగాణ  రాష్ట్రంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి  తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆర్టీసీ కార్మికులు. అయితే ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేసిన  త్రిసభ్య కమిటీ కార్మికుల డిమాండ్ లను  అంగీకరించలేదు. దీంతో సమ్మె సైరన్ మోగించక తప్పలేదు. 

 

 

 

 

 

 

 నిన్నటి నుంచి మొదలైన సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన ప్రభుత్వం... అద్దె,  ప్రైవేటు బస్సులు నడిపేందుకు ప్రయత్నించింది.  అయితే ప్రభుత్వం ప్రైవేటు అద్దె బస్సులను నడిపినప్పటికి పూర్తి స్థాయిలో మాత్రం ప్రయాణికుల కష్టాలు తీరలేదు. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్  కూడా విధించింది ప్రభుత్వం. శనివారం  సాయంత్రం 6 గంటల వరకు సమ్మె విరమించి విధుల్లో చేరిన వారిని ఆర్టీసీ కార్మికులకు గుర్తిస్తామని... విధులకు హాజరు కానీ  వారిని  ఉద్యోగం నుండి తొలగిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. 

 

 

 

 అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు డేట్ లైన్ విధించిన నేపథ్యంలో కార్మికులు మాత్రం సమ్మె విరమించలేదు. తెలంగాణ ఆర్టీసీ లో మొత్తం 49,733 మంది కార్మికులు పని చేస్తుండగా... డెడ్ లైన్ ముగిసేసరికి విధులకు హాజరయింది  కేవలం 160 మంది మాత్రమే.వీరిలో  డ్రైవర్, కండక్టర్ విభాగాలకు చెందిన వారు పది మంది మాత్రమే ఉన్నారు. మిగతా వారందరూ సూపర్వైజర్లు,  క్లర్క్ కేడర్ల   ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా ఆర్టీసీ సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు  ఆర్టిసి ఐకాస నాయకులు. అయితే వీక్లీ ఆఫ్,  స్పెషల్ ఆఫ్,  నైట్ డ్యూటీ లో రిలీఫ్  లో ఉన్న వాళ్ళు 13 వేల మంది వరకు ఉంటారని వీరికి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో చేరేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: