బంగారం ధరలు భారీగా పెరిగాయి.ఇటీవలి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది.పండుగ సీజన్,అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ధరలు పెరిగాయి. ఈ ప్రభావం భారత్ పైన పడింది.ఈ పెరుగుదలకు పండుగ సీజన్ కూడా ఓ కారణం.ఇక ఈ పసిడి ధర హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పైకి కదిలింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగింది. దీంతో ధర రూ.39,790కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.


అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.120 పెరుగుదలతో రూ.36,480కు చేరింది. పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,000 పెరుగుదలతో రూ.48,000కు చేరింది.ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.38,450కు చేరింది. అదే సమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 పెరిగింది. దీంతో ధర రూ.37,250కు చేరింది.బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,000 పెరుగుదలతో రూ.48,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడం ఇందుకు కారణం.


విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదల తో 1,513.45 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 17.63 డాలర్లకు ఎగసింది.బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు అత్యవసరం అయితే తప్ప కొనుగోలు చేయడం లేదు.దీంతో సెప్టెంబర్,అక్టోబర్ నెలలో బంగారం దిగుమతులు మూడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ఒక మన మార్కెట్ విషయానికి వస్తే బంగారం ధర కాస్త దిగిరావడంతో పండుగ,పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: