ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం తో  సంచలనం సృష్టించారు. దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడానికి ఈ ని నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో రెండు వేల రూపాయల నోటు తెరమీదికి వచ్చింది. అయితే రెండు వేల రూపాయలు వచ్చినప్పటి నుంచి ప్రజలకు చిల్లర కష్టాలు మొదలయ్యాయి. మామూలుగా ₹500 ఉంటేనే చిల్లర దొరకడం కష్టం... అలాంటిది 2000 రూపాయల నోటుతో చిల్లర దొరక్క  అష్టకష్టాలు పడ్డారు ప్రజలు. 2000 నోటు తో ఎక్కువ లావాదేవీలు  చేసిన వారికి ఇది ఒక ప్లస్ పాయింట్ అయినప్పటికీ... సామాన్య ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. 2000 నోట్లు రాకతో అటు ఏటీఎం లో కూడా 2000 500 రూపాయలు మాత్రమే లభించడంతో.... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

 

 

 

 

 

 అయితే క్రమక్రమంగా రెండు వేల రూపాయలు నోటు వాడకం తగ్గితూ  వస్తుంది .  ఈ మేరకు దేశంలో ప్రజలందరికీ ఎక్కువ మొత్తంలో సేవలందిస్తున్న ఎస్బిఐ బ్యాంక్ 2000 రూపాయల నోట్ ని ఎస్బిఐ ఎటిఎం లో తొలగించనుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ సూచనలతో ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్బిఐ కి సంబంధించిన అన్ని ఏటీఎంల  నుండి రెండు వేల రూపాయల క్యాసెట్లను తొలగించనుంది ఎస్బిఐ. 200, 100 రూపాయల నోట్లు మాత్రమే ఉండేలా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 

 

 

 

 

 అయితే ఏటీఎం లో 200, 100 రూపాయల నోట్లు మాత్రమే ఉంచడంతో... చిన్ననోట్ల  కారణంగా ఏటీఎంలో ఉంచే నగదు పరిమితి తగ్గే అవకాశం ఉండటంతో  లావాదేవీల పరిమితిని పెంచే ఆలోచనలో ఉందట  ఎస్బిఐ. గా  మెట్రో నగరాల్లో పది సార్లు నగదు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుండగా...  ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఏటీఎంలో నుంచి నగదు తీసుకునే సదుపాయం కల్పిస్తోంది ఎస్బిఐ .

మరింత సమాచారం తెలుసుకోండి: