వాహన దారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్, డీజల్ ధరలు వరుసగా 5వ రోజు తగ్గిపోయాయి. గత నాలుగు రోజులగా భారీగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ఈరోజు కూడా తగ్గుతూ వస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 13 పైసలు చొప్పున దిగొచ్చింది. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రో ధర 78.43 రూపాయలకు చేరింది.      

                          

డీజిల్ ధర 72.96 రూపాయలకు తగ్గింది. ఇంకా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయినా అమరావతిలో కూడా పెట్రోల్, డీజల్ ధరలు భారీగా తగ్గాయి. డీజల్ ధర కూడా 13 పైసలు క్షణతతో 72.22 రూపాయలకు చేరింది. ఇంకా విజయవాడలో పెట్రోల్ ధర 13 పైసలు తగ్గుదలతో రూ.77.66కు క్షీణించింది. డీజిల్ ధర 12 పైసలు క్షీణతతో రూ.71.88కు తగ్గింది.               

                          

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.26 శాతం తగ్గుదలతో 58.22 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.19 శాతం క్షీణతతో 52.71కు తగ్గింది. ఏది ఏమైనా పండుగా వేళ పెట్రోల్, డీజల్ ధరలు భారీగా తగ్గటం వాహనదారులకు ఊరట నిస్తుంది. మరి పండుగా తర్వాత పెట్రోల్ ధర ఎలా ఉంటది అనేది చూడాలి.            

                  

                       

మరింత సమాచారం తెలుసుకోండి: