చదువుకు వయసు ఉంటుందని అంటారు. మెదడు లేతగా ఉన్నపుడే అన్నీ వంటబడతాయి అందులే పూర్వం కేవలం 16 ఏళ్ళకే అన్ని విద్యలూ వచ్చేలా చూసేవారు. కౌమరదశలోనే మెదడుకు ఎక్కినవి జీవితకాలం ఉంటాయని కూడా చెబుతారు. ఇంగ్లీష్ పాలన వచ్చాక చదువుల వయసు పెరిగింది. ఇపుడు వయసులో సంబంధం లేకుండా అందరూ చదువుకుంటున్నారు.  ఎంతవరకూ అవి గుర్తు ఉంటున్నాయన్నది ప్రశ్న. ఇక చేతికి సర్టిఫికేట్లు వస్తున్నాయి కానీ బుర్రలో గుజ్జు మాత్రం లేకుండా పోతోంది.


ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో ఖాకీలకు అగ్నిపరీక్ష  వచ్చిపడింది. ఇన్నేళ్ళ సర్వీసులో వాళ్ళకు ఇంగ్లీష్  పాఠాలు చెబుతున్నారు. ఆంగ్లంలో తప్పనిసరిగా ప్రావీణ్యం ఉండాల్సిందేనని కొత్తగా అదేశాలు అధికారులు జారీ చేయడంతో ఖాకీల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోకపోతే చిక్కులు తప్పవని హుకుం జారీ చేయడం సమస్యలు తెచ్చిపెడుతోందంట.


యూపీలోని  బలరామ్ పూర్   జిల్లా పోలీసులకు అక్కడ  ఎస్పీ రంజన్ వర్మ  వినూత్న‌ ఆదేశాలు ఇవ్వడం పెద్ద చర్చగా ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్  పత్రికకు చదవండి అంటూ ఎస్పీ ఇచ్చిన ఆదేశాలతో ఖాకీలకు కొత్త చావు వచ్చిపడిందని అంటున్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారం, కోర్టులు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇంగ్లీషులోనే ఉండడంతో  చాలా మంది పోలీసులు వాటిని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నారని అంటున్నారు.


దీంతో ఇంగ్లీష్ నేర్చుకోవాలని జిల్లా పోలీసులకు ఎస్పీ రంజన్  వర్మ ఆదేశాలు జారీ చేశారు. ఇది బాగానే ఉన్నా ఈ వయసులో మాకు ఇంగ్లీష్  చదువులేంటి, మేము చదవగలమా అని ఖాకీలు తెగ ఫీల్ అవుతున్నారట. హిందీ మాత్రమే వచ్చిన ఖాకీలు కొత్త చదువేంటి అంటూ పరేషాన్ అవుతున్నారట. తప్పనిసరి పరిస్థితుల్లో పుస్తకాలు ముందేసుకుని ఆన్లగ పాఠాలు బట్టీయం పడుతున్నారట. మరి బుర్రలకెక్కుతుందా..చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: