తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది.తమ  డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. దీంతో దసరా సీజన్ కావడంతో ప్రయాణికుల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. దీనికితోడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికుల  జేబులు గుల్ల  అవుతున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు నడుపుతున్నాం అని  చెబుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్రయాణికుల అవసరం మాత్రం తెలియడం లేదు. కాగా  ప్రభుత్వం నడుపుతున్న బస్సుల్లో  కూడా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు గగ్గోలు  పెడుతున్నారు. 

 

 

 

 

 ఆర్టీసీ సమ్మె ప్రారంభమై మూడు రోజులకు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పై ఇప్పటి వరకు సరైన హామీ ఇవ్వలేకపోయారు. దీంతో మూడు రోజుల పాటు ఇంకా సమ్మె కొనసాగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే కేసీఆర్ తీరుపై  ఇప్పటికే ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి . కెసిఆర్ ఆర్టీసీ కార్మికులు విషయంలో  నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు  ప్రతిపక్ష నేతలు. ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తీరును నిరసిస్తూ నిప్పులు చెరిగారు. 

 

 

 

 

 

 నేడు మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్  కెసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పై లేదా... కనీసం ఆర్టీసీ కార్మికుల తో మాట్లాడడానికి ఒక గంట సమయం కూడా కేసీఆర్ కుదరడం లేదా అంటూ  కేసీఆర్ పై ప్రశ్నించారు లక్ష్మణ్. ఆర్టీసీ లో ఉన్న లక్షల కోట్ల రూపాయల ఆస్తిని... తన అనుచరులకు దోచి పెట్టె  యోచనలో కెసిఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.తెలంగాణ  ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని కాదని... అసలు ఉద్యమంతో సంబంధం లేని వారికి   మంత్రి పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. తెలంగాణ విచ్చిన్నం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ బంగారు తెలంగాణ కాదు కల్వకుంట తెలంగాణ మారిందని ఫైర్ అయ్యారు బీజేపీ లక్ష్మణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: