మందు బాబులకు ఉరటనిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ ఎలా అంటే ఆలా రేట్లు విధిస్తే మద్యం వ్యాపారస్తులు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువకు మద్యం అమ్మితే చుక్కలు కనిపించేలా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 


లిక్కర్ ఏదైనా సరే ఎమ్మార్పీ రేటుకే అమ్మాలని తేల్చి చెప్పింది. కాదని ఎక్కువ రేట్లకు అమ్మితే రూ.2 లక్షలు ఫైన్‌ వేయడంతోపాటు వారం రోజులు షాపు లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు ప్రకటించారు. దసరా, బతుకమ్మ పండుగల రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఏ వైన్‌ షాపు యజమాని ప్రయత్నించినా బారి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 


ఇప్పటికే మద్యం షాపులపై టాస్క్‌ఫోర్స్ అధికారులు నిఘా పెట్టారు. కాగా తెలంగాణాలో దసరా, బతుకమ్మ పండుగలు అతి పెద్ద పండుగలు. అందరూ ఆధ్యాతికత, ఆనందం కలిసిన ఈ పండగలను ఘనంగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగా వేళ మాంసంతో పాటు మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతాయి. అందుకే ఇదే అదునుగా చూసుకొని మద్యం షాపు వారు ఎమ్మార్పీ కన్న ఎక్కువ రేటు వేసి భారీగా మందుబాబుల నుంచి భారీగా వసూలు చేద్దామని చూస్తారు. కానీ ఈసారి ఆలా చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. కాగా ఈ హెచ్చరికలు పట్టించుకోకుండా ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మిన వారిపై మేరె కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ కంప్లైంట్ ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్లు ఇవే .. 


ఫిర్యాదు చేయాల్సిన ఫోన్​ నెంబర్:


స్టేట్‌ కంట్రోల్‌ రూం: 040-24733056


హైదరాబాద్‌: 040-24746884


రంగారెడ్డి: 040-24600450


ఆదిలాబాద్‌: 08732-220229


నిజామాబాద్‌: 08762-237551


మెదక్‌: 08455-271232


నల్గొండ: 08682-224271


మహబూబ్‌నగర్‌: 08542-242488


వరంగల్‌: 08702-577412


కరీంనగర్‌: 08782-262330


ఖమ్మం: 08742-224342.


మరింత సమాచారం తెలుసుకోండి: