చంద్రబాబు అయిదేళ్ళ పాలనను జనం చూశారు. మార్కులు వేశారు. బాబు ఎన్ని అయినా చెప్పుకోవచ్చు కానీ ప్రజలకు మాత్రం నచ్చలేదు. అందుకే కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఇచ్చి పక్కన పెట్టేశారు. చంద్రబాబుకు పాలనాదక్షునిగా పేరుంది. ఆయన దేన్ని అయినా సుసాధ్యం చేస్తారని కూడా అంతా అంటారు. కానీ బాబు దక్షత‌, సమర్ధత ప్రశ్నార్ధకం అయ్యేలా దారుణమైన ప్రజా తీర్పు వచ్చింది.


అది ఎందుకు జరిగింది అంటే కొన్ని సంఘటనలు, అందులో  మానవ తప్పిదాలు ఉన్నాయి.  అలాగే ప్రక్రుతి తెచ్చిన ముప్పు కూడా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ళ కాలంలో మూడు సార్లు బోటు ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది దారుణంగా జలసమాధి అయ్యారు. నాడు విపక్షంగా ఉన్న వైసీపీ దాని మీద చేసిన రాధ్ధాంతం  అంతా ఇంతా కాదు, రాజీనామాలు చేయమనేంతవరకూ కూడా విపక్షం  నాడు డిమాండ్ చేసి వచ్చింది.


ఇక మరో వైపు చూసుకుంటే ఎమ్మెల్యేల ఆగడాలు నాడు పెచ్చుమీరాయి. ఎమ్మెల్యేలు వరసగా అధికార మదంతో చేసిన పనులు టీడీపీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా నాడు దెందులూరు  ఎమ్మెలే చింతమమేని ప్రభాకర్ చౌదరి తయారయ్యాడు. ఆయన అప్పటి తాశీల్దార్ వనజాక్షి విషయంలో చేసిన దాడులు, వాటి మీద బాబు చర్యలు తీసుకోకపోవడంతో అతి పెద్ద చెడ్డ పేరు కేవలం ఆ సంఘటన వల్లనే వచ్చిందని అంటారు.


ఇక ఇదే రకమైన ఘటనలు జగన్ నాలుగు నెలల పాలనలో కూడా వచ్చాయి. జగన్ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా గోదావరి పడవ ప్రమాదం జరిగిపోయింది.  జగన్ సర్కార్ ఇక్ చెడ్డపేరు తెచ్చింది. విశేషమేంటంటే ఇప్పటికి కూడా 14 మంది చనిపోయిన వారి ఆచూకీ తెలియలేదు. బోటుని కూడా వెలికితీయలేకపోయారు. ఇది జగన్ సర్కార్ కి అతి పెద్ద మచ్చగా ఉంది.


అదే విధంగా చూసుకుంటే చింతమనేని తరహాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రీడ్డి వ్యవహారం తయారైంది. ఆయన సైతం అదే విధంగా ఓ మహిళా ఎండీవో పైన దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇది నిజంగా జగన్ కి పెద్ద తలనొప్పిగా మారింది.  విపక్షంలో ఉన్నపుడు జగన్ ఎపుడూ కూడా చింతమనేని ఘటనను చెబుతూ ఉండేవారు.


ఇపుడు తన పాలనలోనే  అలా జరగడంతో జగన్ పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు. ఎంత కాదనుకున్నా చంద్రబాబు సర్కార్ తో పోలుస్తూ జగన్ వచ్చినా ఇలాగే జరుగుతోందని అంతా అంటున్నారు. మరి అధికారంలో ఉన్నది కేవలం నాలుగు నెలలు మాత్రమే. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగకపోతే జగన్ సర్కార్ సైతం బాబు మాదిరిగా విమర్శలకు గురి అవుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: