మంచి చెడు విజయం సాధించిన రోజుకు సంకేతంగా భావించి  దేశవ్యాప్తంగా దసరా పండుగ జరుపుకుంటున్నారు హిందువులు. హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒకటైన దసరా పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తొమ్మిది రోజులపాటు అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహిస్తున్న హిందువులు... ఈరోజు దసరా పండుగ జరుపుకుంటున్నారు. కాగా ఒకప్పటి పెద్దలకు దసరా పండుగ విశేషాలు తెలిసినప్పటికీ... ఇప్పటి యువత కి మాత్రం దసరా పండుగ గురించి అంతగా తెలియదు.అసలు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు అనే విషయం కూడా చాలామందికి తెలియదు. దసరా పండుగ జరుపుకోవడానికి గల విశేషాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. 

 

 

 

 

 

 దసరా అనే పదంలోని ఒక విశేష అర్థం దాగి ఉంది. దసరా అనే పేరును విభజిస్తే సంస్కృతంలో ఒక విశిష్టమైన అర్థం వస్తుంది. దశ హర అని దసరాని రెండు విభాగాలుగా విభజించితే అర్ధం సూర్యున్ని తిరిగి ప్రభావితం చేసిన రాముడికి కీర్తి ప్రతిష్టలు కలుగు గాక అని అర్ధం వస్తుంది. లోకకల్యాణం కోసం రాముడు, రావణుడికి జరిగినా యుద్ధంలో రావణుడు సూర్యున్ని బంధించే ప్రయత్నం చేయగా... రాముడు రావణుణ్ణి వధించి సూర్యున్ని బంధించకుండా ఆపడంతో భూమి పై సూర్యకిరణాలు పడేలా రామయ్య ప్రభావితం చేసాడు. అందువల్లే ఈ ఘటనకు దసరా పండుగ అని పేరుతో  జరుపుకుంటున్నారు అని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు మహిషాసుర వర్ధినిగా అవతరించి మహిషాసురుని సంహరించటంతో  ఈ యుద్దాన్ని చెడుపై మంచి విజయానికి   సంకేతంగా భావించి విజయ దశమి గా హిందువులు   జరుపుకుంటారు. 

 

 

 

 

 

భారత దేశానికి వెన్నుముక్కైనా రైతులు జరుపుకునే సంక్రాంతితో పాటు దసరాకి కూడా ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నా పంటలకు ఎలాంటి అపాయం కలగకుండా రక్షించమంటూ  దేవుళ్లను రైతులు ప్రార్థించే పండుగగా దసరా పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా దసరా పండుగ రోజు దహనం చేసే  దశకంఠుని 10 తలlల్లో  10 సూచికలు  ప చూపిస్తుంటాయి. మనుషుల్లోని కామం, మొహం, క్రోధం, ఆవేశం, అసూయా, ద్వేషం, క్రూరత్వం సహా తదితర మనుషుల్లోని కోణాలను దశకంఠుడి  రూపంలో అమర్చి... మనలో ఇవ్వన్నీ పోవాలని రావణ దహనం చేస్తాం.దేశ వ్యాప్తంగా అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి భక్తి నిష్టలతో పది రోజుల పాటు ఒక యజ్ఞంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తారు భక్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి: