నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను బెంబేలెత్తుతున్నాయి . ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ శాతం వర్షపాతం నమోదు కావడంతో నగరవాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక నగర పరిస్థితి చినుకు పడితే చిత్తడి అన్న చందంగా మారింది. నగరంలో వర్షం పడితే ఏ ప్రమాదం ముంచుకొస్తుండోనని  ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎందుకంటే ఓవైపు రోజురోజుకు ఎక్కువవుతోన్న విషజ్వరాలు...మరో వైపు  వరద నీటితో చెరువుల్ల మారుతున్న రహదారులు.కాగా  దసరా పండుగ రోజు కూడా నగరవాసులకు వర్షంతో  తిప్పలు తప్పలేదు. 

 

 

 

 

 

 నిన్న దసరా పండుగ వేడుకలను హ్యాపీగా జరుపుకుందాం అనుకున్న నగరవాసులకు వర్షం భారీ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి నిమిషాల్లోనే భారీ వర్షం కురవడం... రోడ్లపైకి వరద నీరు చేరడం... రోడ్లన్నీ జలమయం అవడం దీంతో ప్రజలకు మళ్లీ తిప్పలు మొదలయ్యాయి. నిన్న కురిసిన భారీ వర్షంతో చాలా రహదారులు  చెరువులను తలపించాయి. కాగా  ఈ రోజు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. 

 

 

 

 

 ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. భారీ వర్షాలే  కాకుండా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని... నగర ప్రజలు ఇళ్లలోనుంచి  బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో... పిడుగుపాటుకు ముగ్గురు చనిపోయారు. దీంతో వర్షం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: