మొన్నటి ఎన్నికల్లో  ప్రజలు గూబ గుయ్యిమనిపించినా తెలుగుదేశంపార్టీకి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయిందో అప్పటి నుండి అధికార వైసిపిపై అక్కసు పెంచుకుంది. మామూలుగా అయితే ఓడిపోయిన పార్టీ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ చంద్రబాబునాయుడు తీరు మాత్రం చాలా విచిత్రంగా తయారవుతోంది.

 

ఇటువంటి చిత్ర విచిత్రాల్లో ఒకటి పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపటం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన, పనితీరుపైన తాను గానీ టిడిపి నేతలు కానీ ఆరోపణలు, విమర్శలు చేస్తే జనాలు పట్టించుకోరని అర్ధమైనట్లుంది. అందుకనే పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారు.

 

ఈ పెయిడ్ ఆర్టిస్టుల పనేమిటంటే మామూలు జనాల్లో కలిసిపోయి అవకాశం వచ్చినపుడల్లా లేకపోతే అవకాశాన్ని సృష్టించుకుని మరీ జగన్ పై దుమ్మెత్తిపోయటమే. మామూలు జనాల్లో కలిసిపోయి జనాల్లాగే జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే చూసేవాళ్ళు కూడా ప్రభుత్వంపై జనాలు మండిపోతున్నారనే అనుకుంటారు. అంతేకానీ వాళ్ళంతా టిడిపి పెయిడ్ ఆర్టిస్టులన్న ఆలోచన చేయరు.

 

ఈ మధ్య వచ్చిన వరదల సందర్భంగా ఓ రైతు వేషంలోను, తర్వాత తుపాను వచ్చినపుడు కృష్ణాజిల్లాలో మామూలు జనాల్లాగ కొందరు మహిళలు జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున మండిపడిన విషయం చూసిందే. అయితే వాళ్ళంతా టిడిపి పెయిడ్ ఆర్టిస్టులన్న విషయం వెంటనే బయటపడిపోయి పార్టీ పరువు పోయింది. అయినా టిడిపికి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు.

 

తాజాగా ఆటోలకు వైసిపి స్టిక్కర్లను అంటిస్తున్న పోలీసులంటూ ఎల్లోమీడియా, టిడిపి సోషల్ మీడియా రెచ్చిపోతున్న విషయం అందరకీ తెలిసిందే. తమ ఆటోలకు వైసిపి స్టిక్కర్లు అంటించుకుంటేనే ఏడాదికి రూ. 10 వేలు దక్కుతుందని అనధికారికంగా పార్టీ చెప్పిందని ఎల్లోమీడియా తెగ ప్రచారం చేస్తోంది. ఇపుడు వైసిపి సోషల్ మీడియా అలర్టయి పై ఫొటోలను బయటపెట్టింది. పై ఫొటోల్లోని వ్యక్తి పోలీసు డ్రస్ లోనే ఉన్నా బ్యాడ్జి మాత్రం కనబడటం లేదు. దీన్నే వైసిపి సోషల్ మీడియా బయటపెట్టి టిడిపిపై ఎదురుదాడికి దిగింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: