తాజాగా  ఈఎస్ఐ స్కామ్  కలకలం రేపింది. కాగా  పోలీసులు ఈఎసై  స్కామ్ నిందితులను  అదుపులోకి తీసుకొని చంచల్ గూడా జైలు కి  రిమాండ్ కు తరలించారు. ఈఎసై స్కామ్  లో పట్టుబడిన నిందితులను తాము  విచారణ చేసేందుకు అనుమతించాలని ఏసీబీ అధికారులు కోర్టును  కోరగా  అంగీకరించారు. ఈ నేపథ్యంలో నేడు చంచల్ గూడా జైల్లో  రిమాండ్ లో  ఉన్న నిందితులను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా రెండు రోజుల పాటు ఈఎస్ఐ  స్కామ్ నిందితులను  విచారిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

 

 

 

 

 

 అయితే ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ లో   12 మందిని అరెస్టు చేశారు ఎసిబి అధికారులు. కాగా  ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి సహా  మరో 13 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వారిని చంచల్ గూడా  జైలులో రిమాండ్ లో  ఉంచారు . ఈ స్కామ్ కి  సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నిందితులను విచారించేందుకు  సీబీఐ అధికారులు నిర్ణయించారు . కాగా రిమాండ్లో ఉన్న ఎస్ఐ స్కామ్  నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు  ఏసీబీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. కాగా దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు రెండు రోజులపాటు ఎస్ఐ స్కాం నిందితులను   విచారణ చేసేందుకు ఏసీబీ అధికారులకు అవకాశం కల్పించింది. 

 

 

 

 

 

కోర్టు  ఇచ్చిన ఆదేశాల మేరకు రిమాండ్లో ఉన్న ఈఎస్ఐ  నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే ఎస్ఐ స్కామ్ గురుంచి  పలు వివరాలను తెలుసుకున్నారు. ఈఎస్ఐ  అధికారుల బినామీలు ఫార్మా కంపెనీలను నడుపుతున్న విషయం ఏసీబీ అధికారులకు తెలిపారు . కాగా కోర్టు అనుమతి ఇచ్చిన రెండు రోజులలో ఈ ఎస్ఐ  నిందితులను విచారించి లోతుగా దర్యాప్తు చేసి మరిన్ని ఆధారాలు సేకరిస్తామని   ఎసిబి అధికారులు తెలిపారు .

మరింత సమాచారం తెలుసుకోండి: