హైద‌రాబాద్‌ను వ‌ర్షం ముప్పు వీడ‌టం లేదు. న‌గర పరిధిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.  హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం ప్రారంభమ‌వ‌డం, కొన‌సాగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యం...వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరవాసులు సాధ్యమైనంత వరకు కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.వరద నీరు నిలిచిన చోట మ్యాన్‌హోల్స్ ఒపెన్ చేసే ప్రయత్నం చేయవద్దని, జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వాలని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని కోరారు.


ఇక స‌హాయ చ‌ర్య‌ల్లో భాగంగా, నగరంలో నీటి నిల్వలు, వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను తొలగించేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్  తెలిపారు. 'దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. నీరు నిలిచి ఉన్న దగ్గర ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. వర్షానికి పడిన గుంతలను వెంటనే మరమ్మతులు చేస్తున్నాం. వర్షాల వల్ల గ్రేటర్‌లో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. గంటకు రెండు సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రోడ్లపై నీరు నిలుస్తుంది. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించి వాటిని వెడల్పు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నగరంలో డెంగీ కేసులో తగ్గిపోయాయని' వివరించారు.హైదరాబాద్‌లో రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్షలు సాగుతున్నాయ‌ని వివ‌రించారు. 


ఇదిలాఉండ‌గా, నిబంధనలు అతిక్రమిస్తే ఇలాంటి చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ  అధికారులు స్పష్టం చేశారు.నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటున్న వివ‌రాల‌ను వెల్ల‌డించారు. హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రధాన రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు భవన నిర్మాణ వ్యర్థాలు వేశారు. ఇలా భాద్యతా రాహిత్యంగా ప్రవర్తించి, రోడ్డుపై వ్యర్థాలు వేసి, ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన వారిపై జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిపై అధికారులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని జీహెచ్‌ఎంసీ ప్రజలకు సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: